Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫుడ్ బిజినెస్ లోకి ఆనంద్ దేవరకొండ, ఈ వీకెండ్ మీ సగం బిల్ నాది అంటున్న విజయ్ దేవరకొండ

Webdunia
గురువారం, 26 నవంబరు 2020 (18:39 IST)
టాలీవుడ్ యంగ్ స్టార్ విజయ్ దేవరకొండ వ్యాపారంలోనూ తన అభిరుచి చాటుతున్నారు. రౌడీ వేర్ ఫ్యాషన్ బ్రాండ్లతో పాటు ఇటీవల ఎలక్ట్రిక్ వెహికిల్ కంపెనీలో భాగస్వామి అయ్యారు. అన్న చూపిన బాటలో తమ్ముడు ఆనంద్ దేవరకొండ కూడా పయనిస్తున్నాడు. ఇటీవల మిడిల్ క్లాస్ మెలొడీస్ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న ఆనంద్ దేవరకొండ తన స్నేహితులు నిర్వహిస్తున్న "గుడ్ వైబ్స్ ఓన్లీ" కేఫ్‌లో పార్టనర్ అయ్యారు.
 
హైదరాబాద్ ఖాజాగూడలో ఈ కేఫ్ ఫుడ్ లవర్స్‌ను ఆకర్షిస్తోంది. ఈ విషయాన్ని ఆనంద్ దేవరకొండ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ఈ వీకెండ్ గుడ్ వైబ్స్ ఓన్లీ కేఫ్‌కు వచ్చిన కస్టమర్ల సగం బిల్ తాను పే చేస్తానని విజయ్ దేవరకొండ అనౌన్స్ చేశారు.
 
ఆనంద్ దేవరకొండ ట్వీట్ చేస్తూ...."నేను మా అన్నయ్య విజయ్ ఇద్దరం ఫుడ్ బేస్డ్ మూవీస్ తోనే మంచి సక్సెస్ అందుకున్నాం. "మిడిల్ క్లాస్ మెలొడీస్" ద్వారా వచ్చిన నా రెమ్యునరేషన్‌ను ఈ ఫుడ్ బిజినెస్ లోనే ఇన్వెస్ట్ చేస్తున్నాను. మా స్నేహితులు కలిసి నిర్వహిస్తున్న "గుడ్ వైబ్స్ ఓన్లీ" కేఫ్‌లో భాగస్వామి అవడం సంతోషంగా ఉంది. మీ ప్రేమ వల్లే మా కలలను నెరవేర్చుకోగలుగుతున్నాం." అని పేర్కొన్నారు.
 
విజయ్ దేవరకొండ స్పందిస్తూ... "మిడిల్ క్లాస్ మెలొడీస్" సినిమా హిట్ అయిన సంతోషంలో ఉన్నాను. నేను నా ఆనందాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నా. అందుకే ఈ వీకెండ్ "గుడ్ వైబ్స్ ఓన్లీ" కేఫ్‌కు వచ్చే మీ కోసం సగం బిల్ నేను చెల్లిస్తాను. సో మీ అందరికీ వెల్‌కమ్. బిల్ నాది" అని ట్వీట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

KTR: సమంత విడాకులకు కేటీఆర్‌ కారణం.. కొండా సురేఖకు కవిత శుభాకాంక్షలు.. ఏంటిది?

Dinosaur-Era Discovery: రాజస్థాన్‌లో ఎముకలతో కూడిన అవశేషాలు.. డైనోసార్ యుగానికి చెందినవా?

జూనియర్ ఎన్టీఆర్‌పై కామెంట్లు- దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్‌పై చంద్రబాబు సీరియస్?

కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డికి షాక్.. ముసుగు ధరించిన వ్యక్తి నుంచి లెటర్.. రూ.2కోట్లు డిమాండ్

భద్రాచలం వద్ద గోదావరి నది నీటి మట్టం పెంపు.. మూడవ హెచ్చరిక జారీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments