Webdunia - Bharat's app for daily news and videos

Install App

సిగరెట్ తాగుతున్న కాళీమాత... మరో అభ్యంతరక పోస్ట్ చేసిన దర్శకురాలు

Webdunia
గురువారం, 7 జులై 2022 (14:24 IST)
డాక్యుమెంటరీ ఫిల్మ్ డైరెక్టర్ లీలా మణిమేగలై మరో అభ్యంతరకర పోస్టు చేశారు. ఇప్పటికే ఆమె విడుదల చేసిన ఓ పోస్టరుపై దేశ వ్యాప్తంగా చర్చ సాగుతోంది. కాళిమాత సిగరెట్ తాగుతున్నట్టుగా ఆ పోస్టరు ఉంది. దీనిపై పెద్ద దుమారమే చెలరేగింది. ఇపుడు ఈ దర్శకురాలు అభ్యంతరకర పోస్ట్‌ పెట్టారు. 
 
దేవుళ్ల వస్త్రధారణలో ఉన్న వ్యక్తులు సిగరెట్‌ తాగుతున్న ఫొటోను ట్విటర్‌లో పోస్ట్ చేసిన లీనా.. 'ఎక్కడో మరోచోట' అనే పదాన్ని రాశారు. తాజా వివాదానికి కారణమైన ‘కాళీ’ పోస్టర్‌ కోవలోనే ఈ ఫొటో ఉండటం గమనార్హం. కాళీ వివాదం విషయంలో తనపై పలు కేసులు నమోదైన నేపథ్యంలో.. తాజా పోస్ట్‌తో లీనా తన వాదనను సమర్థించుకునేయత్నం చేసింది.
 
తమిళనాడు రాష్ట్రంలోని మదురైకి చెందిన లీనా మణిమేగలై.. 'రిథమ్స్‌ ఆఫ్‌ కెనడా'లో భాగంగా 'కాళీ' పేరుతో ఓ డాక్యుమెంటరీ చిత్రీకరించారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను కెనడాలోని టొరంటోలోని ఉన్న అగాఖాన్‌ మ్యూజియంలో విడుదల చేశారు. అయితే, ఆ పోస్టర్‌ దేవతా మూర్తిని కించపరిచేలా ఉందని ఆరోపిస్తూ భారత్‌లో నిరసనలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. అందులోకి కాళీ చేతిలో సిగరెట్‌ కన్పించడం, వెనుకవైపు స్వలింగ సంపర్కుల జెండా వంటివి తీవ్ర వివాదానికి దారితీశాయి.
 
ఈ క్రమంలోనే ఆమె చేసిన పోస్ట్‌ మత విశ్వాసాలను దెబ్బతీసేలా ఉందంటూ పలు రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి. అటు కెనడాలోని భారత హైకమిషన్‌ కూడా దీన్ని తీవ్రంగా పరిగణించింది. దీంతో స్పందించిన అగాఖాన్‌ మ్యూజియం.. ఆ డాక్యుమెంటరీని ప్రదర్శన నుంచి తొలగించింది. అటు ట్విటర్‌ కూడా లీనా పోస్టర్‌ను తొలగించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అంబులెన్స్‌కు దారివ్వని కారు డ్రైవర్.. రూ.2.5 లక్షల అపరాధం.. లైసెన్స్ రద్దు.. (Video)

'విశ్వ సుందరి'గా డెన్మార్క్ అందాల భామ

ఆవు పేడ కుప్పలో రూ.20 లక్షల నోట్లు

గుంటూరు మేయరుపై కేసు నమోదు... అరండల్ పేట పోలీసులకు ఫిర్యాదు

లేడీ టీచర్ కుర్చీ కింద బాంబు అమర్చి రిమోట్‌తో పేల్చిన విద్యార్థులు.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడం కొన్ని బాదంపప్పులు తినండి

దుమ్ము లేదా డస్ట్ అలర్జీ ఉందా? ఐతే ఇలా చేయండి

తర్వాతి కథనం
Show comments