Webdunia - Bharat's app for daily news and videos

Install App

బోల్డ్‌గా అమలాపాల్.. వెబ్‌సిరీస్‌లో కైరా అద్వానీ తరహాలో అందాల ఆరబోత

Webdunia
ఆదివారం, 13 అక్టోబరు 2019 (15:12 IST)
బోల్డ్‌గా అమలాపాల్ వెబ్‌సిరీస్‌లో మరింత బోల్డ్‌గా నటించనుందని టాక్ వస్తోంది. సినిమాల కంటే వెబ్ సిరీస్‌లకే క్రేజ్ అమాంతంగా పెరుగుతోంది. సినీ దర్శకులు, సినీ నటులు కూడా వెబ్ సిరీస్‌పై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు.
 
ఇటీవల హిందీలో హిట్ అయిన లస్ట్ స్టోరీస్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఇందులో కైరా అద్వానీ నటించింది. ప్రస్తుతం లస్ట్ సోరీస్ తెలుగు రీమేక్‌లో ''ఆడై'' నగ్నంగా నటించి హిట్ కొట్టిన అమలాపాల్ మరింత బోల్డుగా నటించనుందని వార్తలు వస్తున్నాయి. 
 
లస్ట్ స్టోరీస్‌లో నాలుగు భిన్న నేపథ్యాల కథను డీల్ చేశారు. హిందీ ఒరిజినల్స్‌లో నాలుగు భిన్న నేపథ్యాలను నలుగురు అగ్ర దర్శకులు తెరకెక్కించిన సంగతి తెల్సిందే. ఇప్పుడు ఈ నెట్ ఫ్లిక్స్ ఒరిజినల్ 'లస్ట్ స్టోరీస్'కు తెలుగు వెర్షన్ సిద్ధమవుతోంది. ఇందుకోసం ఈ ఒరిజినల్‌ను నందిని రెడ్డి, తరుణ్ భాస్కర్, సంకల్ప్ రెడ్డి, సందీప్ రెడ్డి తెరకెక్కిస్తారు. రోనీ స్క్రవాలా ఈ ఒరిజినల్‌ను నిర్మిస్తారు.
 
నందిని రెడ్డి తెరకెక్కించే సెగ్మెంట్‌లో బోల్డ్ బ్యూటీ అమలా పాల్ నటిస్తుంది. హిందీ వెర్షన్‌లో ఈ రోల్‌ను కైరా అద్వానీ అత్యంత బోల్డ్‌గా నటించి అందరినీ ఆకట్టుకుంది. ఈ సెగ్మెంట్‌లో స్వయంతృప్తి పొందే ఒక సీన్‌పై జనాల్లో విపరీతమైన చర్చ కూడా జరిగింది. మరి తెలుగు వెర్షన్‌లో కూడా ఈ సీన్ వుంచుతారా లేదా అనేది తెలియాలంటే వేచి చూడాలి. 
 
అలా వుంచితే మాత్రం అమలాపాల్ ఈ సీన్‌లో నటించాల్సి వుంటుంది. మరికొన్ని సన్నివేశాల్లో అందాల ఆరబోతకు సిద్ధంగా వుండాలని నందినిరెడ్డి ఇప్పటికే సమాచారం చేరవేశారని టాలీవుడ్ వర్గాల్లో టాక్ వస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీ మంత్రి నారా లోకేష్‌కు అరుదైన గౌరవం.. ఆస్ట్రేలియా సర్కారు నుంచి పిలుపు

రోడ్లపై తిరగని వాహనాలు పన్నులు చెల్లించక్కర్లేదు : సుప్రీంకోర్టు

వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీకి భారీ వర్ష సూచన

గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నానికి షాకిచ్చిన కోర్టు

జనసేన సంస్థాగత బలోపేతం కోసం త్రిశూల్ వ్యూహం : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం