Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమలాపాల్‌కు విడాకులు... మంజూరు చేసిన చెన్నై ఫ్యామిలీ కోర్టు

సినీ నటి అమలాపాల్, తమిళ దర్శకుడు విజయ్‌లకు చెన్నై ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. దీంతో వారిద్దరు అధికారికంగా విడిపోయినట్టయింది. కొన్ని నెలల పాటు ప్రేమించుకున్న అమలాపాల్ - విజయ్‌లు గత 2014 జూ

Webdunia
బుధవారం, 22 ఫిబ్రవరి 2017 (16:14 IST)
సినీ నటి అమలాపాల్, తమిళ దర్శకుడు విజయ్‌లకు చెన్నై ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. దీంతో వారిద్దరు అధికారికంగా విడిపోయినట్టయింది. కొన్ని నెలల పాటు ప్రేమించుకున్న అమలాపాల్ - విజయ్‌లు గత 2014 జూన్‌ 12న వీరిద్దరూ పెద్దల సమక్షంలో ఒక్కటైన విషయం తెలిసిందే. అయితే పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉండాలన్న అత్తింటి వారి నిబంధనను అమల పాటించకపోవడంతో వారి మధ్య విభేదాలు తలెత్తాయి. 
 
దీంతో ఆ జంట వివాహమైన కొంత కాలానికే విడిపోవాలని నిర్ణయించుకుని చెన్నై కోర్టును ఆశ్రయించారు. వారిద్దరికి కోర్టు కొంత సమయం కూడా ఇచ్చింది. అయితే, విజయన్‌తో కలిసి జీవించేది లేదని అమలాపాల్ తెగేసి చెప్పింది. జ్యూడీషియల్‌ సెపరేషన్‌లో భాగంగా గత ఆర్నెల్లుగా విడివిడిగా ఉంటున్న వీరికి మంగళవారం విడాకులు మంజూరయ్యాయి. 
 
కాగా, వివాహ బంధానికి దూరమైన తర్వాత ఈ ఇద్దరూ తమ తమ కెరీర్‌లపై పూర్తిగా దృష్టి కేంద్రీకరించారు. అమల చేతిలో ఇప్పటికే అరడజను ఆఫర్లు ఉండగా.. విజయ్‌ కూడా రెండు సినిమాలకు దర్శకత్వం వహించేందుకు సమ్మతించాడు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

టీడీపీ జెండాను పట్టుకున్న నందమూరి హీరో కళ్యాణ్ రామ్.. మా మధ్య అవి లేవండి?

అన్నా ఒకసారి ముఖం చూస్కో.. ఎలా అయిపోయావో.. వంశీ అభిమానుల ఆందోళన (video)

అమరావతిలో చంద్రబాబు శాశ్వత ఇంటి నిర్మాణం ప్రారంభం.. ఎప్పుడు.. ఎక్కడ?

ఎస్బీఐ బ్యాంకు దొంగతనం- బావిలో 17 కిలోల బంగారం స్వాధీనం

మయన్మార్‌ భూకంపం.. 2,056కి పెరిగిన మృతుల సంఖ్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments