Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్‌లో అల్లు (రామలింగయ్య) స్టూడియో..

Webdunia
గురువారం, 1 అక్టోబరు 2020 (14:49 IST)
టాలీవుడ్ హాస్య నటుడు అల్లు రామలింగయ్య 99వ జయంతి వేడుకలు గురువారం హైదరాబాద్ నగరంలో జరిగాయి. ఈ సందర్భంగా ఆయన చిత్ర పటానికి అల్లు కుటుంబ సభ్యులంతా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అల్లు వారి ఫ్యామిలీ ఆయన జ్ఞాపకార్థం అల్లు స్టూడియోస్ పేరిట భారీ స్టూడియో నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. 
 
ఈ స్టూడియో నిర్మాణ పనులు ప్రారంభించినట్టు అల్లు కుటుంబ సభ్యులు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తమ కుటుంబం మొత్తానికి సినిమా అంటే ప్రాణమని, తమకు ఆనందాన్నిచ్చేది సినిమానే అని స్పష్టం చేశారు. అల్లు రామలింగయ్య ఘనవారసత్వాన్ని కొనసాగించేందుకు తమకు సినిమానే మార్గమని ఈ ప్రకటనలో వివరించారు.
 
అల్లు స్టూడియోస్‌ను ఆయన జ్ఞాపకార్థం అంకితమిస్తున్నామని ప్రకటించారు. అందరి ఆశీస్సులు, శుభాకాంక్షలతో ఈ స్టూడియో నిర్మాణానికి పునాదిరాయి వేశామన్నారు. ఈ స్టూడియోను హైదరాబాద్ నగరంలో నిర్మించనున్నారు. ఇది సినిమా, టీవీ చిత్రీకరణలకు ఉపయోగపడేలా ఈ స్టూడియో భారీస్థాయిలో నిర్మాణం జరుపుకోనుంది.
 
కాగా, ఈ అల్లు స్టూడియో ప్రారంభోత్సవంలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, హీరోలు అల్లు అర్జున్, అల్లు శిరీష్, నిర్మాత అల్లు బాబీ పాల్గొన్నారు. తన ముగ్గురు తనయులతో కలిసి ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్న అల్లు అరవింద్ ఎంతో ఉత్సాహంగా కనిపించారు. స్టూడియో ప్రారంభించడంపై అల్లు అరవింద్ త్వరలో ప్రకటన చేస్తారని తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎవరికాళ్లో మొక్కి మంత్రి పదవి తెచ్చుకోవాలనుకోవట్లేదు : కె.రాజగోపాల్ రెడ్డి

24 గంటల్లో భారత్‌కు మరో షాకిస్తాం : డోనాల్డ్ ట్రంప్

Bangladesh: ఐదు నెలల పాటు వ్యభిచార గృహంలో 12 ఏళ్ల బాలిక.. ఎలా రక్షించారంటే?

Pavitrotsavams: తిరుమలలో వార్షిక పవిత్రోత్సవాలు ప్రారంభం

ఆన్‌లైన్ బెట్టింగులు - అప్పులు తీర్చలేక పోస్టల్ ఉద్యోగి ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments