Webdunia - Bharat's app for daily news and videos

Install App

విడుదలకు ముందే "పుష్ప"రాజ్ సంచలనం!

Webdunia
సోమవారం, 12 ఏప్రియల్ 2021 (08:51 IST)
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - దర్శకుడు కె.సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం పుష్ప. అల్లు అర్జున్ కెరీర్‌లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న మూడో చిత్రం. అయితే ఇప్పటివరకు వీరి కాంబినేషన్‌లో వచ్చిన ఆర్య, ఆర్య -2 సినిమాలను తెలుగు వరకే పరిమితం చేసిన సుకుమార్ ఈసారి పుష్ప సినిమాను మాత్రం పాన్ ఇండియా సినిమాగా రూపొందిస్తున్నారు. 
 
అంటే ఈ సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా హీరోగా మారబోతున్నాడని అర్థమవుతుంది. మేకర్స్ ఇదివరకే సినిమాను పాన్ ఇండియా లెవెల్లో ఆగస్టు 13న విడుదల చేస్తామని ప్రకటించారు. అందుకు తగ్గట్టుగానే షూటింగ్ కూడా శరవేగంగా పూర్తి చేసుకుంటోంది ఈ సినిమా. 
 
అయితే పాన్ ఇండియా స్టార్ కాకముందే కేవలం ‘పుష్ప’ ఇంట్రడక్షన్ వీడియోతో రికార్డులు బ్రేక్ చేస్తున్నాడు. ఇదివరకు వచ్చిన పాన్ ఇండియా సినిమాలు "బాహుబలి", "ఆర్‌ఆర్‌ఆర్" సినిమాలతో పాటు సూపర్ స్టార్ రజనీకాంత్ "రోబో", "2.0" సినిమాల టీజర్లను కూడా "పుష్ప" సినిమా ఇంట్రడక్షన్ వీడియో బీట్ చేసింది. 
 
రెండు రోజుల్లో ఈ వీడియో 34 మిలియన్స్ వ్యూస్ దక్కించుకొని ట్రెండింగ్‌లో ఉంది. ఈ వీడియో అటు క్లాస్ ఇటు మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ లెక్కన "పుష్ప" సినిమాపై ప్రేక్షకులకు ఏ రేంజ్‌లో ఆసక్తి నెలకొందో అర్ధం చేసుకోవచ్చు. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తుండగా.. రష్మిక మందన్న, ఫాహద్ ఫాజిల్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pawan Kalyan: తమిళనాడులో జనసేన ఏర్పాటు.. స్టాలిన్‌ను కొనియాడిన పవన్ కల్యాణ్

రాళ్లతో కొడతానంటే ప్రశ్నపత్రం చూపించాను... వాళ్లు ఫోటో తీసుకున్నారు : విద్యార్థిని

మాజీ స్పీకర్ తమ్మినేని డిగ్రీ సర్టిఫికేట్.. నకిలీదా.. విచారణ జరపండి..!!

ఏపీలో 4 రోజుల పాటు వడగళ్ల వర్షం ... ఈదురు గాలులు వీచే అవకాశం... ఐఎండీ

Lawyer: హైదరాబాదులో దారుణం: అడ్వకేట్‌ను కత్తితో దాడి చేసి హత్య- డాడీని అలా చేశారు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments