Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ‌న్నీ మొత్తం 5 ప్రాజెక్టులు ఓకే చేసాడా..?

Webdunia
గురువారం, 7 మార్చి 2019 (21:34 IST)
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా అట్ట‌ర్ ఫ్లాప్ అవ్వ‌డంతో బాగా ఆలోచ‌న‌లో ప‌డ్డాడు. కొంత గ్యాప్  తీసుకున్న‌ప్ప‌టికీ.. ఇక నుంచి గ్యాప్ లేకుండా సినిమాలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్‌తో సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ భారీ చిత్రాన్ని గీతా ఆర్ట్స్, హారిక & హాసిని క్రియేష‌న్స్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతోంది. త్వ‌ర‌లో సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. 
 
ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ల‌కుండానే..బ‌న్నీ, సుకుమార్‌తో సినిమాని ఎనౌన్స్ చేసారు. ఆర్య‌, ఆర్య 2 త‌ర్వాత బ‌న్నీ, సుక్కు క‌లిసి చేస్తున్న క్రేజీ మూవీని మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ నిర్మిస్తుంది. త్రివిక్ర‌మ్ సినిమాతో పాటే సుకుమార్ సినిమాని కూడా స్టార్ట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. 
 
అయితే... బ‌న్నీ ఈ రెండు సినిమాలే కాకుండా ఇంకా మూడు సినిమాల‌కు ఓకే చెప్పాడ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఇంత‌కీ ఆ మూడు సినిమాలు ఏంటంటే... మ‌నం ఫేమ్ విక్ర‌మ్ కుమార్‌తో ఓ సినిమా. సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ మురుగుదాస్‌తో మ‌రో సినిమా. బాలీవుడ్ మూవీ ఒక‌టి. మొత్తం ఐదు సినిమాల‌ను ఓకే చేసాడ‌ట‌. మొత్తానికి బ‌న్నీ ప్రాజెక్ట్స్‌ని బాగానే సెట్ చేసుకుంటున్నాడు. మ‌రి..ఈ సినిమాల‌తో ఎలాంటి స‌క్స‌స్ సాధిస్తాడో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మామిడిగూడ కుగ్రామంలో నీటి కొరత.. పొలం నుంచి కుండ నీళ్లు తెచ్చేందుకు అష్టకష్టాలు

కెనడాలో భారతీయుడిని కత్తితో పొడిచి చంపేశారు.. కారణం ఏంటి?

రక్తంతో పవన్ ఫోటో గీసిన అభిమాని.. నెట్టింట వైరల్

ఉత్తమ విద్యా వ్యవస్థ.. సమగ్ర విధాన పత్రం సిద్ధం చేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి

వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం.. ముస్లిం సోదరుల హర్షం.. ప్రధాని పేరును సువర్ణాక్షరాల్లో?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments