Webdunia - Bharat's app for daily news and videos

Install App

Pushpa 2 Pepper Spray: పుష్ప-2 అరాచకాలు.. పెప్పర్ స్ప్రే చల్లింది ఎవరు? (video)

సెల్వి
శుక్రవారం, 6 డిశెంబరు 2024 (14:33 IST)
Pushpa 2 Pepper Spray: పుష్ప-2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఇప్పటికే థియేటర్ యాజమాన్యంతో పాటు నటుడు అల్లు అర్జున్‌పై పోలీసు కేసు నమోదయ్యింది. 
 
ఈ ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాల్సిందిగా మానవహక్కుల కమిషన్‌కు లాయర్ రామారావు విజ్ఞ‌ప్తి చేశారు. ఈ పిటిషన్‌ను ఎన్‌హెచ్ఆర్సీ విచారణకు స్వీకరించి.. త్వరలోనే దర్యాప్తు చేపట్టనుంది. ఇలాంటి ఘటనలో పలు సినిమా థియేటర్లలో జరుగుతోంది. ఫ్యాన్స్ దురుసుగా ప్రవర్తిస్తూ ఓవరాక్షన్ చేస్తున్న వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 
 
ఈ నేపథ్యంలో ముంబై - బాంద్రా ఏరియాలో ఉండే గెలాక్సీ థియేటర్‌లో పుష్ప 2 సినిమా ప్రదర్శిస్తూ ఉండగా ఇంటర్వెల్ సమయంలో గుర్తు తెలియని దుండగులు పెప్పర్‌ స్ప్రే కొట్టడంతో ప్రేక్షకులు ఊపిరి ఆడక, దగ్గుతో థియేటర్‌ నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనతో పలువురు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 
 
ఈ స్ప్రే చేసింది ఎవరు అనే విషయాన్ని గుర్తించేందుకు పోలీసులు విచారణ చేపట్టినట్లు చెప్పారు. థియేటర్‌ యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదును బాంద్రా పోలీసులు నమోదు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రేమించినోడితో కుమార్తె వెళ్లిపోతుంటే యువకుడి కాళ్లపై పడి దణ్ణంపెట్టిన తండ్రి... ఎక్కడ?

ఏపీ సీఎం చంద్రబాబే నాకు స్ఫూర్తి.. రాయలసీమ సంపన్న ప్రాంతంగా మారాలి: పవన్

YSRCP MLAs: శాసనసభ్యులకు అరకు కాఫీతో పాటు ఐప్యాడ్‌లు, గిఫ్ట్ హ్యాంపర్స్

మరిదిపై మోజు పడిన వొదిన: ఆమె కుమార్తెను గర్భవతిని చేసిన కామాంధుడు

Netumbo: నమీబియాకు తొలి మహిళా అధ్యక్షురాలిగా నంది-న్దైత్వా ప్రమాణం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments