Webdunia - Bharat's app for daily news and videos

Install App

25 మిలియ‌న్ల ఫాలోవ‌ర్స్ ను చేరుకున్న అల్లు అర్జున్

డీవీ
గురువారం, 21 మార్చి 2024 (18:41 IST)
Allu Arjun
ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్ ఫాలోయింగ్‌, ఆయ‌నకున్న క్రేజ్ ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. పుష్ప చిత్రంతో అంత‌ర్జాతీయంగా అభిమానుల‌ను సంపాందించుకున్న ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ రోజు రోజుకు త‌న పాపులారిటీని పెంచుకుంటూనే పోతున్నాడు. ప్ర‌తి విష‌యంలో త‌నకంటూ ఒక బ‌ల‌మైన మార్క్‌ను క్రియేట్ చేసుకంటున్నాడు. ఇటీవ‌ల ఉత్త‌మ న‌టుడిగా నేష‌న‌ల్ అవార్డ్‌తో అందుకున్న తొలి తెలుగు హీరోగా రికార్డ్ క్రియేట్ చేసిన అల్లు అర్జున్ అన్ని విష‌యాల్లోనూ అంద‌ర్ని దాటి ముందుకు దూసుక వెళ్తున్నాడు.

తాజాగా త‌న సోష‌ల్ మీడియా ఇన్‌స్టా అకౌంట్ ఫాలోవ‌ర్స్ విష‌యంలో ఐకాన్‌స్టార్ కొత్త రికార్డును నెల‌కొల్పాడు. అల్లు అర్జున్ ఇన్‌స్టా అకౌంట్‌ను కోట్ల మంది ఫాలో అవుతున్నాడు. ఇన్‌స్టాలో ఎప్ప‌డూ యాక్టివ్‌గా వుండే ఈ ఐకాన్‌స్టార్ 25 మిలియ‌న్ల ఫాలోవ‌ర్స్ ను చేరుకున్నాడు. ఇన్‌స్టాలో ఇంత మంది ఫాలోవ‌ర్స్ వున్న మొద‌టి సౌత్ హీరో అల్లుఅర్జున్ కావ‌డం విశేషం. ఈ విష‌యాన్ని ఐకాన్‌స్టార్ త‌న అకౌంట్‌లో తెలుపుతూ మీ అభిమానానికి ఎప్ప‌టికి థ్యాంక్స్ అంటూ పోస్ట్‌ను పెట్టాడు. ఇక ఈ విష‌యంలో త‌మ హీరో క్రియేట్ చేసిన రికార్డు విష‌యంలో ఐకాన్‌స్టార్ అభిమానులు ఫుల్ ఖుషీలో వున్నారు. అంతేకాదు అల్లు అర్జున్ న‌టిస్తున్న తాజా చిత్రం  పుష్ప ది రూల్ (పుష్ప‌-2) ఎన్ని రికార్డులు క్రియేట్ చేయ‌నుందో అంటూ లెక్క‌లేసుకుంటున్నారు ఐకాన్‌స్టార్ అభిమానులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సుప్రీంకోర్టు జడ్జీలకు చేదు అనుభవం... విమానంలో మందుబాబుల వీరంగం

'పప్పుగాడు' అనే మాట అనలేదు.. జగన్ అంటే అభిమానం: రామ్ గోపాల్ వర్మ (video)

చెన్నైకు 480 కిమీ దూరంలో తీవ్ర వాయుగుండం.. ఏపీకి భారీ వర్షాలు

అయ్యప్పమాల ధరించిన ఆర్టీసీ డ్రైవర్‌కు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ (Video)

లోక్‌సభ సభ్యురాలిగా ప్రియాంకా గాంధీ ప్రమాణ స్వీకారం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments