Webdunia - Bharat's app for daily news and videos

Install App

అయోధ్య రామాలయంలో ప్రియాంక చోప్రా దంపతులు.. మెరిసిన మాల్తీ

సెల్వి
గురువారం, 21 మార్చి 2024 (18:37 IST)
Priyanka Chopra
నటి ప్రియాంక చోప్రా జోనాస్, ఆమె భర్త, అమెరికన్ గాయకుడు నిక్ జోనాస్ తన పుత్రికతో కలిసి అయోధ్యను సందర్శించుకున్నారు. ప్రియాంక చోప్రా రెండేళ్ల కుమార్తె మాల్తీ మేరీ జోనాస్‌తో కలిసి అయోధ్యలోని రామమందిరంలో పూజలు చేశారు.
 
పసుపు రంగు చీర ధరించిన ప్రియాంక చోప్రా, కుర్తాలో నిక్ జోనాస్, పీచ్ కలర్ గౌనులో మాల్తీలకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. రామయ్య దర్శనం, పూజల తర్వాత ఆలయ పూజారుల నుంచి తీర్థప్రసాదాలు అందుకున్నారు. పూజారుల ఆశీస్సులు తీసుకున్నాక వారితో కలిసి ఫొటోలకు ఫోజిచ్చారు.
 
అంతకుముందు రోజు, ఈ స్టార్ జంట తమ కుమార్తెతో అయోధ్య విమానాశ్రయంలో ఫోటోలకు ఫోజులిచ్చారు. 
 
జనవరి 22న జరిగిన మహా సంప్రోక్షణ మహోత్సవం తర్వాత వారు రామమందిరాన్ని ప్రియాంక చోప్రా సందర్శించడం ఇదే తొలిసారి. ఈ వేడుకకు అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, అలియా భట్-రణ్‌బీర్ కపూర్, విక్కీ కౌశల్-కత్రినా కైఫ్ రిషబ్ శెట్టితో సహా పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.

ఇకపోతే.. ప్రియాంక చోప్రా మంగళవారం ముంబైలో జరిగిన ప్రైమ్ వీడియో ప్రెజెంట్స్ ఈవెంట్‌కు హాజరయ్యారు. ఈ సందర్భంగా తన రాబోయే ప్రాజెక్టు "విమెన్ ఆఫ్ మై బిలియన్" డాక్యుమెంటరీని వివరాలను మీడియాతో షేర్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దువ్వాడతో కొడుకుని కంటాను.. ఆయన లేక నేను లేను.. బయోపిక్ తీస్తాం.. దివ్వెల మాధురి (video)

వామ్మో... Cyclone Fengal తుపానులో చెన్నై రన్ వేపై విమానం జస్ట్ మిస్ (Video)

ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ ముఖంపై ద్రవం పోసిన వ్యక్తి

తెలంగాణలో రూ. 200 కోట్ల భారీ అవినీతి తిమింగలం నిఖేష్, ఏసీబి సోదాలు

విశాఖపట్నంలో జరిగిన కేబెల్ స్టార్ సీజన్ 3 విజేతలను ప్రకటించిన ఆర్ఆర్ కేబెల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments