Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్లు అర్జున్‌ రఫ్ఫాడిస్తున్నాడుగా.. దక్షిణాది ఏ హీరోకూ ఈ ఫాలోయింగ్ లేదుగా..!

Webdunia
శనివారం, 6 జూన్ 2020 (20:15 IST)
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కు అరుదైన గౌరవం దక్కింది. తెలుగుతో పాటు ఇతర భాషల్లో మంచి గుర్తింపు సంపాదించిన అల్లు అర్జున్.. దక్షిణాదిన ఏ హీరో సొంతం చేసుకోని కొత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఫేస్‌బుక్‌లో ఏకంగా 13 మిలియన్ లైక్స్ అందుకున్నాడు అల్లు అర్జున్.

అంటే కోటి 30 లక్షల లైక్స్ అన్నమాట. దక్షిణాదిన ఇంత ఫేస్ బుక్ ఫాలోయింగ్ ఉన్న నటుడు బన్నీ మాత్రమే కావడం విశేషం. మోస్ట్ లవ్డ్ సౌత్ ఇండియన్ స్టార్‌గా లైకుల వర్షం కురిపించారు.. ఆయన ఫ్యాన్స్. 
 
మరోవైపు ఇన్‌స్టాలో కూడా రప్ఫాడిస్తున్నాడు అల్లు అర్జున్. అటు సినిమాలు.. ఇటు సోషల్ మీడియాలో తనకు తానే సాటి అంటూ ముందుకు కదులుతున్నాడు అల్లు అర్జున్. ప్రస్తుతం ఈయన సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్నాడు. 
 
లాక్‌డౌన్ తర్వాత సినిమా షూటింగ్ మళ్లీ మొదలు కానుంది. ఇప్పటికే కొంతభాగం చిత్రీకరించారు. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన అల వైకుంఠపురములో సినిమా బంపర్ హిట్ అయ్యింది. ఈ సినిమా కూడా హిందీలో రీమేక్ కాబోతుంది. అల వైకుంఠపురములో చిత్రం ఒకటి రెండు కాదు.. 150 కోట్లకు పైగా వసూలు చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతదేశపు అంతర్జాతీయ బయోఫార్మా ఆశయాలకు మద్దతు ఇస్తోన్న ఎజిలెంట్

ఏపీలో ఇక స్మార్ట్ రేషన్ కార్డులు.. మంత్రి నాదెండ్ల వెల్లడి

US: పడవ ప్రయాణం.. వర్జీనియాలో నిజామాబాద్ వ్యక్తి గుండెపోటుతో మృతి

కన్నతండ్రి అత్యాచారం.. కుమార్తె గర్భం- ఆ విషయం తెలియకుండానే ఇంట్లోనే ప్రసవం!

TGSRTC: హైదరాబాద్- విజయవాడ మధ్య బస్సు సర్వీసులపై టీజీఎస్సార్టీసీ తగ్గింపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments