Webdunia - Bharat's app for daily news and videos

Install App

దుబాయ్‌లో ఉన్న అల్లు అర్జున్ బంపర్ ఆఫర్..

ఓవర్‌సీస్‌ మార్కెట్‌ను బాగా క్యాష్‌ చేసుకునేందుకు యువ హీరోలు విదేశాల్లో షూటింగ్‌లు, ఆడియో వేడుకలు చేస్తున్నారు. ఇప్పుడు అల్లు అర్జున్‌ కూడా అదే చేస్తున్నాడు. ఇప్పటికే దర్శకుడు హరీష్‌ శంకర్‌ డైరెక్ట్ చ

Webdunia
సోమవారం, 6 మార్చి 2017 (16:43 IST)
ఓవర్‌సీస్‌ మార్కెట్‌ను బాగా క్యాష్‌ చేసుకునేందుకు యువ హీరోలు విదేశాల్లో షూటింగ్‌లు, ఆడియో వేడుకలు చేస్తున్నారు. ఇప్పుడు అల్లు అర్జున్‌ కూడా అదే చేస్తున్నాడు. ఇప్పటికే దర్శకుడు హరీష్‌ శంకర్‌ డైరెక్ట్ చేస్తున్న చిత్రం 'దువ్వాడ జగన్నాథం'. టీజర్‌ విడుదలలో డివైడ్‌ టాక్‌ రావడంతో దాన్ని బాగా పబ్లిసిటీకి ఉపయోగించుకున్నారు. చిత్రీకరణ 70 శాతం పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఈ సినిమా షెడ్యూల్‌ దుబాయిలో అబుదాబిలో జరుగుతోంది. 
 
అక్కడ అల్లు అర్జున్‌, పూజ హెగ్డేలపై పాటల చిత్రీకరణ జరుగుతోంది. ఈ పాటల్లో అల్లు అర్జున్‌ వేయబోయే స్టెప్స్‌ అభిమానులను అమితంగా ఆకట్టుకుంటాయని, సినిమాకి మరింత బలాన్ని చేకూరుస్తాయని వినికిడి. తాజాగా అల్లు అర్జున్‌ అబుదాబి సెట్స్‌‌లో ఉన్న తనను అభిమానులు వచ్చి కలుసుకోవచ్చని బంపరాఫర్‌ కూడా ప్రకటించాడు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం మే నెల మధ్యలో విడుదలయ్యే అవకాశాలున్నాయి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

జనసేన పార్టీకి ఇంధనం దిల్ రాజు, నా బంగారం రామ్ చరణ్: డిప్యూటీ సీఎం పవన్

మకర సంక్రాంతికి ఏపీలో జగన్మోహన్ రెడ్డి వుండరా?

Telangana : తెలంగాణలో ఎటువంటి కేసులు లేవు - HMPVపై భయం వద్దు

Thota Trimurthulu: పవన్ కళ్యాణ్‌ను ముఖ్యమంత్రిగా చూడాలి.. తోట త్రిమూర్తులు

ఉత్తర భారతదేశాన్ని కప్పేస్తున్న పొగమంచు, కుక్కపిల్లలకు చలిమంట వేస్తున్న యువకుడు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోగనిరోధక శక్తి పెంచే ఆహారం ఇదే

గరం మసాలా ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

acidity అసిడిటీని తగ్గించే కొత్తిమీర రసం

బొప్పాయి పండు ఎందుకు తినాలి?

న్యూరోఫార్మకాలజీ, డ్రగ్ డెలివరీ సిస్టమ్స్‌లో కెఎల్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణలు

తర్వాతి కథనం
Show comments