ద‌టీజ్ అల్లు అర్జున్....

Webdunia
మంగళవారం, 23 అక్టోబరు 2018 (14:31 IST)
తుఫాను భీభత్సంతో అతలాకుతలం అయిన శ్రీకాకుళం ప్రాంత ప్రజల్ని ఆదుకునేందుకు టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముందుకొచ్చారు. తిత్లి తుఫాన్ కారణంగా జనజీవనం అస్తవ్యస్తంగా మారి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎవరైనా కష్టాల్లో ఉన్నారన్న విషయం తెలిసినా… ప్రకృతి వైపరీత్యాలతో ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారని తెలిసినా చలించిపోతారు స్టైలిష్ స్టార్. అవి మన తెలుగు రాష్ట్రాలైనా… పొరుగు రాష్ట్రాలైనా ఆయన స్పందించే తీరు మర్చిపోలేం. గతంలో తమిళనాడుకి 25 లక్షలు, కేరళకి 25 లక్షలు తన వంతు సహాయం చేసి అభిమానుల చేత సదరన్ సూపర్ స్టార్ అని పిలిపించుకుంటున్నారు.
 
అంతేకాకుండా వారికి సేవా కార్యక్రమాలపై స్ఫూర్తిదాయకంగా నిలిచాడు. గతంలో, వైజాగ్‌లో వచ్చిన హుద్‌హుద్ విపత్తుకి 20 లక్షలు ఇవ్వటమే కాకుండా ఉత్తరాఖండ్‌కి 10 లక్షలు ఇచ్చారు. ఇటీవల సంభవించిన చెన్నై తుఫాను బాధితులకు అండగా నిలిచి 25 లక్షలు సహాయం చేసారు. ఈ మధ్యే కేరళ వరద బాధితులకు 25 లక్షలు ఇవ్వటమే కాకుండా వారిలో మనోధైర్యం నింపారు. 
 
ఇక ఇప్పుడు తిత్లి తుఫాన్ శ్రీకాకుళం ప్రాంతాన్ని అతలాకుతలం చేసింది. ఉత్తరాంధ్ర ప్రాంతం అంటే అల్లు అర్జున్‌కి మొదటినుండి ప్రత్యేకమైన అభిమానం ఉంది. వారిని ఆదుకునేందుకు అల్లు అర్జున్ 25 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించి తన ఔదార్యం చాటుకున్నారు. ప్రజలంతా ధైర్యంగా ఉండాలని… అభిమానులంతా సహాయ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని ఈ సందర్భంగా అల్లు అర్జున్ పిలుపునిచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇన్ఫోసిస్ ఆంధ్రప్రదేశ్‌కు తరలిపోతుందా? కేంద్ర మంత్రి కుమారస్వామి కామెంట్స్

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు : ఇండియా కూటమిలో చీలిక - ఆర్జేడీ 143 స్థానాల్లో పోటీ

కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో నిందితుడు రియాజ్ ఎన్‌కౌంటర్... ఖాకీల సంబరాలు

హిందూ ధర్మంపై విశ్వాసం ఉన్న ప్రతి ఒక్కరికీ దీపావళి శుభాకాంక్షలు : ఉదయనిధి స్టాలిన్

మాట నిలబెట్టుకున్న టీడీపీ కూటమి ప్రభుత్వం - డీఏ విడుదల చేసిన సర్కారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments