Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుష్ప షూటింగ్ ఎప్పటి నుంచి మొదలవుతుందంటే?

Webdunia
సోమవారం, 24 ఆగస్టు 2020 (12:54 IST)
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తోన్న తాజా సినిమా పుష్ప. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ కొన్నాళ్లు జరగగానే కరోనా మహమ్మరి పంజా విసరడంతో షూటింగు ఆగిపోయింది. ఇక ఇప్పుడు మెల్లగా అందరూ షూటింగులకు షెడ్యూల్స్ వేసుకుంటూ ఉండడంతో, పుష్ప షూటింగ్ షెడ్యూల్ కూడా ప్లాన్ చేస్తున్నారు. 
 
మరో రెండు నెలల్లో కరోనా తగ్గుముఖం పడుతుందన్న అంచనాతో నవంబర్ నుంచి ఈ చిత్రం షూటింగ్ నిర్వహించాలని నిర్ణయించారట. ఈ చిత్రం ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్‌లో సాగే కథతో రూపొందుతుండడం వల్ల మహబూబ్ నగర్ జిల్లాలోని అటవీ ప్రాంతంలో షూటింగ్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. మొదటి షెడ్యూల్‌లో ఎక్కువగా హీరోకి సంబంధించిన సన్నివేశాలను షూట్ చేస్తారట. ఇందులో రష్మిక మందన్న కథానాయికగా నటిస్తోంది. 
 
ఇకపోతే, ఈ సినిమా హిందీలోనూ విడుదల కానుంది. పాన్ ఇండియా ప్రాజెక్టుగా తెరకెక్కనున్న ఈ సినిమాలో కీలకమైన సహాయక పాత్రల్లో నటించడానికి పలువురు బాలీవుడ్ నటులను తీసుకువచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Bihar : పదేళ్ల బాలికపై సామూహిక అత్యాచారం.. పొదల్లో ఒకరి తర్వాత ఒకరు..?

Milla Magee: మిల్లా మాగీపై వేధింపులు.. క్షమాపణలు చెప్పిన కేటీఆర్.. ఓ ఆడపిల్ల తండ్రిగా ఇలాంటివి?

Covid: బెంగళూరులో తొలి కోవిడ్ మరణం నమోదు.. యాక్టివ్‌గా 38 కేసులు

శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. కానిస్టేబుల్ మృతి.. మరొకరి పరిస్థితి విషమం

Lion : సింహంతో ఆటలా? ఆ వ్యక్తికి పంజా దెబ్బ తప్పలేదు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments