బుట్టబొమ్మకు భారీ వ్యూస్.. ''వెల్ డన్'' అన్న వార్నర్

Webdunia
మంగళవారం, 24 నవంబరు 2020 (20:18 IST)
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన 'అల వైకుంఠపురములో' చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమా విడుదలకి ముందు మ్యూజిక్ సెన్సేషన్ తమన్ అందించిన పాటలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. ఇక ఆల్బమ్ మొత్తంలో బుట్టబొమ్మ పాటకి అందరూ ఫిదా అయిపోయారు. ఎక్కడ విన్న, చూసిన ఇదే పాట.. ఆ మధ్య టిక్ టాక్‌లో అయితే ఈ పాట చక్కర్లు కొడుతోంది. 
 
తాజాగా ఆస్ట్రేలియా బాట్స్ మెన్, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కెప్టెన్ డేవిడ్‌ వార్నర్‌ తన భార్య క్యాండిస్‌తో కలిసి బుట్టబొమ్మ పాటకి డాన్స్ చేసిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియోను వార్నర్ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో వీడియో తెగ వైరల్‌ అయింది. తాజాగా ఐపీఎల్‌లో ఓ మ్యాచ్ గెలిచిన సందర్భంలో కూడా డేవిడ్ వార్నర్ ఈ బుట్టబొమ్మ పాటకు డ్యాన్స్ చేసి అల్లు అర్జున్ అభిమానులను అలరించాడు వార్నర్.
 
తాజాగా మరోసారి బుట్టబొమ్మ పాటతో వార్తల్లో నిలిచాడు వార్నర్. తాజాగా బుట్టబొమ్మ సాంగ్ యూట్యూబ్‌లో 450 మిలియన్ల వ్యూస్ దాటేసిన సందర్భంగా అల్లు అర్జున్‌ను అభినందించాడు వార్నర్. 'వెల్‌డన్ అల్లు అర్జున్' అంటూ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో బుట్టబొమ్మ పోస్టర్‌ను పోస్ట్ చేశాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కవితతో మంచి సంబంధాలున్నాయ్.. కేటీఆర్ మారిపోయాడు.. నవీన్ కుమార్ యాదవ్

జాగ్రత్తగా ఉండండి: సురక్షిత డిజిటల్ లావాదేవీల కోసం తెలివైన పద్ధతులు

Pawan Kalyan just asking, అడవి మధ్యలోకి వారసత్వ భూమి ఎలా వచ్చింది? (video)

అసూయపడే, అహంకారపూరిత నాయకులకు ప్రజలు అధికారం ఇవ్వరు: రేవంత్ రెడ్డి

Jubilihills: అమెరికాలో బాత్రూంలు కడిగిన సన్నాసికేం తెలుసు?: నవీన్ యాదవ్ తండ్రి కామెంట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments