Webdunia - Bharat's app for daily news and videos

Install App

మనవడికి తాత ఇచ్చిన గిఫ్ట్‌కి షాకైన అల్లు అర్జున్

Webdunia
బుధవారం, 3 ఏప్రియల్ 2019 (17:55 IST)
టాలీవుడ్‌లో స్టైలిష్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న అల్లు అర్జున్ కుమారుడు అల్లు అయాన్ బుధవారం ఐదో పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. కుమారుడి పుట్టినరోజును పురస్కరించుకుని  బన్నీ, ఆయన భార్య స్నేహా రెడ్డి సోషల్‌మీడియాలో అయాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు అందించారు. ‘హ్యాపీ బర్త్‌డే మై బేబీ. వీడు మాకెంతో అమూల్యం' అంటూ పోస్ట్ చేసారు. 
 
ఈ సందర్భంగా అల్లు అర్జున్ తన తండ్రి (అల్లు అరవింద్‌) అయాన్‌కు పుట్టినరోజు బహుమతిగా స్విమ్మింగ్‌ పూల్‌ ఇచ్చారని, ఆ విషయం విని నేను ఇంకా షాక్‌లో ఉన్నానంటూ తెలిపారు. కొద్ది రోజుల క్రితం పుట్టినరోజు బహుమతిగా ఏ కావాలంటూ నాన్న అయాన్‌ను అడిగారు. వాడు స్విమ్మింగ్ పూల్‌ కావాలని చెప్పగా, 45 రోజుల వ్యవధిలో కట్టించేశారు. 
 
అటువంటి తాతయ్య ఉండటం వాడి లక్ అని చెప్పారు. నాలుగో తరం పిల్లలు.. అల్లు పూల్‌’ అంటూ పిల్లలు సరదాగా స్విమ్మింగ్ పూల్‌లో ఉన్న ఫోటోలను బన్నీ షేర్‌ చేశారు. ‘హ్యాపీ బర్త్‌డే అయాన్‌’ అంటూ కుటుంబంతో కేక్‌ కట్‌ చేస్తున్న ఫొటోలను స్నేహారెడ్డి షేర్‌ చేయగా, ‘పుట్టినరోజు శుభాకాంక్షలు రౌడీ బాయ్‌’ అంటూ చిరు చిన్నల్లుడు కల్యాణ్‌దేవ్‌ సోషల్ మీడియాలో విష్ చేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కాల్పుల ఘటన: కెనడాకు వెళ్లిన భారతీయ విద్యార్థిని మృతి

వందలాది మంది అంతర్జాతీయ విద్యార్థుల విద్యా వీసాలు రద్దు

ఇజ్రాయెల్ వైమానిక దాడులు- 45మంది పాలస్తీనియన్లు మృతి

వివాహేతర సంబంధాన్ని క్రిమినల్ నేరంగా పరిగణించలేం.. ఢిల్లీ హైకోర్టు

తూత్తుకుడి లవ్ స్టోరీ... ఉదయం పెళ్లి, మధ్యాహ్నం శోభనం.. రాత్రి ఆస్పత్రిలో వరుడు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments