Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా కాంబినేషన్లో చిత్రం ప్రారంభం

Webdunia
బుధవారం, 22 మార్చి 2023 (17:03 IST)
Allari Naresh, Faria Abdullah, d. sureshbabu
అల్లరి నరేష్ ఇటీవలి కాలంలో భిన్నమైన పంథాను అనుసరించి తాను కామెడీతో పాటు ఇంటెన్స్ పాత్రలు కూడా చేయగలనని నిరూపించుకున్నారు. ఉగాది పర్వదినం సందర్భంగా అభిమానులకు శుభవార్త అందించారు. అల్లరి నరేష్ చేయబోతున్న  ఫుల్ లెంత్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కు కొత్త దర్శకుడు మల్లి అంకం దర్శకత్వం వహిస్తుండగా చిలకా ప్రొడక్షన్స్ ప్రొడక్షన్ నంబర్ 2గా రాజీవ్ చిలక నిర్మిస్తున్నారు. 
 
జాతి రత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తున్నారు. నరేష్ , ఫారియాల కలయికలో వస్తున్న మొదటి సినిమా ఇది. కథలో యూనిక్ పాయింట్ తో పాటు కంప్లీట్  ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ హిలేరియస్  రైడ్ కోసం సిద్ధంగా ఉండండి.
 
తెలుగు సంవత్సరాది సందర్భంగా ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేయడంతో పాటు మేకర్స్ ఈరోజు గ్రాండ్ గా  ప్రారంభ వేడుకను కూడా నిర్వహించారు. 
ఈ కార్యక్రమం లో యంగ్ డైరెక్టర్ / యాక్టర్ తరుణ్ భాస్కర్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా, ప్రముఖ నిర్మాత సురేష్ బాబు క్లాప్ కొట్టగా..ఫస్ట్ షాట్ డైరెక్షన్ నాగ్ అశ్విన్ చేశారు..జెమినీ కిరణ్ మరియు శరత్ మరార్ స్క్రిప్ట్ అందజేశారు.       
 
చిత్ర ప్రారంభోత్సవంలో అల్లరి నరేష్ మాట్లాడుతూ.. ఇది చాలా మంచి కామెడీ ఎంటర్ టైనర్. ప్రేక్షకులు నా నుంచి  కోరుకునే ఫన్ ఫ్యామిలీ ఎమోషన్ డ్రామా అన్నీ ఇందులో వుంటాయి.  ఏప్రిల్ 10 నుంచి షెడ్యుల్ స్టార్ట్ అవుతుంది. అన్నారు
ఫారియా మాట్లాడుతూ.. కొత్త ఏడాదిని కొత్త సినిమాతో మొదలుపెడుతున్నందుకు ఆనందంగా వుంది. చిలకా ప్రొడక్షన్స్ కి కృతజ్ఞతలు. నరేష్ గారి తో పని చేయడం చాలా ఎక్సయిటింగ్ గా వుంది. సినిమా అదిరిపోతుందనే నమ్మకం వుంది’’
 
నిర్మాత మాట్లాడుతూ.. దర్శకుడు మల్లి గారు నాకు పదేళ్ళుగా తెలుసు. ఆయనతో సినిమా చేస్తానని పదేళ్ళ క్రితమే చెప్పాను. ఈ కథ చెప్పినపుడు  ఈ కథకు నరేష్ గారు మాత్రమే న్యాయం చేయగలరనిపించింది. నరేష్ గారితో సినిమా చేయడం ఆనందంగా వుంది.  ఫారియాతో పాటు యూనిట్ అందరికీ కృతజ్ఞతలు’’ తెలిపారు.
 
దర్శకుడు మల్లి మాట్లాడుతూ.. ఇది ఫ్యామిలీ ఎంటర్ టైనర్. నరేష్ గారికి, ఫారియా గారికి కృతజ్ఞతలు. నన్ను నమ్మి ఈ ప్రాజెక్ట్ ఇచ్చిన నిర్మాతకు కృతజ్ఞతలు. రవిగారు నా కథని మరో స్థాయికి తీసుకెళ్ళారు. అందరూ గర్వపడే సినిమా చేస్తాననే నమ్మకం వుంది’’ అన్నారు
 
అబ్బూరి రవి మాట్లాడుతూ.. నరేష్ గారితో ఇది నాకు నాలుగో సినిమా. చక్కటి ఫ్యామిలీ ఎంటర్ టైనర్. మీ అందరికీ నచ్చేలా సినిమా తీయడానికి ప్రయత్నిస్తాం’ అన్నారు. 

సంబంధిత వార్తలు

మే 17 నుంచి 19 వరకు శ్రీ పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవం

నెల్లూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డికి ఓటు వేసిన వైకాపా ఎమ్మెల్యే!!

తెలంగాణ ఏర్పడి జూన్ 2 నాటికి 10 సంవత్సరాలు.. అవన్నీ స్వాధీనం

ఏపీ సీఎస్, డీజీపీలకు కేంద్ర ఎన్నికల సంఘం సమన్లు!

ఘోరం, క్రికెట్ ఆడుతుండగా యువకుడి తలపై పడిన పిడుగు, మృతి

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

తర్వాతి కథనం
Show comments