Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాగార్జున అక్కినేని నా సామిరంగలో అంజిగా అల్లరి నరేష్‌

Webdunia
శుక్రవారం, 15 డిశెంబరు 2023 (12:15 IST)
Nagarjuna- naresh
నాగార్జున అక్కినేని రొమాన్స్, ఫ్యామిలీ డ్రామా ఎమోషన్స్‌తో కూడిన మాస్, యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘నా సామిరంగ’తో రాబోతున్నారు. ఫస్ట్- టైమర్ విజయ్ బిన్నీ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో ఫ్రెండ్ షిప్ కి కూడా ఇంపార్టెన్స్ వుంది. సినిమాలోని ఆ లేయర్ ని ఒక గ్లింప్స్ ద్వారా రివిల్ చేశారు.
 
అల్లరి నరేష్ కీలక పాత్ర పోషిస్తున్నారు,‘అంజి’ పాత్రను ఒక గ్లింప్స్ ద్వారా పరిచయం చేశారు. ఇది కేవలం పాత్రను పరిచయం చేయడానికే కాదు, అల్లరి నరేష్‌తో నాగార్జునకు ఉన్న రిలేషన్ ని చాలా అద్భుతంగా చూపించింది. గ్లింప్స్ ని చూస్తే నరేష్, నాగార్జునతో స్నేహపూర్వక సంబంధాన్ని పంచుకునే సరదా వ్యక్తిగా కనిపించారు. మాటొచ్చేత్తది అనేది తను తరుచుగా వాడే మాటే. ఇది మాటమీద నిలబడే వ్యక్తిగా అతని పాత్రను సూచిస్తుంది.
 
నాగార్జున, అల్లరి నరేష్‌లను కలిసి చూడటం కనుల పండువగా ఉంటుంది. అల్లరి నరేష్  సినిమాకు పెద్ద వాల్యూ అడిషన్. శివేంద్ర దాశరధి పల్లెటూరి వాతావరణాన్ని అద్భుతంగా చూపించగా, ఎంఎం కీరవాణి తన ఆకర్షణీయమైన సంగీతంతో విజువల్స్‌కు మరింత అందాన్ని తీసుకొచ్చారు. గ్లింప్స్ ద్వారా ఈ సినిమా టీజర్‌ను త్వరలో విడుదల చేస్తామని మేకర్స్ అనౌన్స్ చేశారు.
 
ఆషికా రంగానంద్ ఈ చిత్రంలో కథానాయిక. లీడ్ పెయిర్‌లో వచ్చిన ఫస్ట్ సింగిల్- ఎత్తుకెల్లిపోవాలనిపిస్తుంది పాటకు అద్భుతమైన స్పందన వచ్చింది.
 
టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌పై నిర్మాత శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని హై బడ్జెట్‌తో భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. పవన్ కుమార్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.
 
చంద్రబోస్ లిరిక్స్ అందిస్తుండగా, బ్లాక్ బస్టర్ రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడ ఈ చిత్రానికి కథ, మాటలు అందించారు.
 ‘నా సామిరంగ’ 2024లో సంక్రాంతికి థియేట్రికల్ రిలీజ్ అవుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Amaravati Or Vizag?: ఆంధ్రప్రదేశ్ రాజధానికి అమరావతి గుడ్ ఛాయిస్!?

Pawan Kalyan: నాకు డబ్బు అవసరమైనంత కాలం, నేను సినిమాల్లో నటిస్తూనే వుంటా: పవన్

Betting Apps: బెట్టింగ్ యాప్‌ల కేసులో పోలీసుల కీలక అడుగు.. ఆ జాబితాలో?

విమానం బ్రేక్ ఫెయిల్ : డిప్యూటీ సీఎంకు తప్పిన పెను ప్రమాదం!!

Good News: ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. పెండింగ్ బకాయిల విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments