Webdunia - Bharat's app for daily news and videos

Install App

డాకు మహారాజ్ లో అన్నీ ఒరిజినల్ షాట్స్, డూప్లికేట్ కాదు : దర్శకుడు బాబీ

డీవీ
శుక్రవారం, 15 నవంబరు 2024 (14:22 IST)
dakumaharaj-bobby
కార్తీక పూర్ణిమ శుభ సందర్భంగా బాలక్రిష్ణ 109వ చిత్ర టైటిల్ ని ప్రకటించడంతో పాటు, టీజర్ ను విడుదల చేశారు నిర్మాతలు. ఈ సినిమాకి 'డాకు మహారాజ్' అనే శక్తివంతమైన టైటిల్ ను పెట్టారు. శుక్రవారం ఉదయం హైదరాబాద్ లోని ఏఎంబీ మాల్ లో 'NBK109' టీజర్ విడుదల కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు దర్శకుడు బాబీ కొల్లి, నిర్మాత సూర్యదేవర నాగవంశీ, సంగీత దర్శకుడు ఎస్. తమన్ హాజరయ్యారు.
 
96 సెకన్ల నిడివితో రూపొందిన 'డాకు మహారాజ్' టీజర్, టైటిల్ కి తగ్గట్టుగానే అద్భుతంగా ఉంది. "ఈ కథ రాజ్యం లేకుండా యుద్ధం చేసిన ఒక రాజుది, గండ్ర గొడ్డలి పట్టిన యమధర్మ రాజుది, మరణాన్ని వణికించిన మహారాజుది" అంటూ 'డాకు మహారాజ్'గా బాలకృష్ణను పరిచయం చేసిన తీరు అదిరిపోయింది. మునుపెన్నడూ చూడని సరికొత్త రూపంలో గుర్రంపై బాలకృష్ణ ఎంట్రీ ఇవ్వడం అభిమానులకు పూనకాలు తెప్పించేలా ఉంది. టీజర్ లోని ప్రతి ఫ్రేమ్ లో భారీతనం కనిపిస్తుంది. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. తమన్ నేపథ్య సంగీతం టీజర్ ని మరోస్థాయికి తీసుకెళ్లింది. మొత్తానికి టీజర్ చూస్తుంటే, బాలకృష్ణతో కలిసి దర్శకుడు బాబీ థియేటర్లలో ప్రేక్షకులను సరికొత్త అనుభూతిని అందించే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ను అందించడబోతున్నారని అర్థమవుతోంది. 
 
టీజర్ విడుదల కార్యక్రమంలో దర్శకుడు బాబీ కొల్లి మాట్లాడుతూ, " టీజర్ మీ అందరికీ నచ్చిందని భావిస్తున్నాను. మీరు చూసిన టీజర్ లో డూపులు లేవు, డూప్లికేట్ లు లేవు. బాలకృష్ణ గారే అన్నీ నిజంగా చేశారు. గుర్రం ఎక్కింది ఆయనే, నడిపింది ఆయనే, యుద్ధానికి వచ్చేది కూడా ఆయనే. మీరు చూసినవన్నీ ఒరిజినల్ షాట్స్. తమన్ గారు అద్భుతమైన సంగీతం అందించారు. నేనైనా, నాగవంశీ గారైనా దీనిని ఎప్పుడూ సాధారణ సినిమాలా చూడలేదు. బాలయ్య గారు సృష్టిస్తున్న రికార్డులను దృష్టిలో పెట్టుకొని, కేవలం మాస్ లోనే కాకుండా అన్ని వర్గాలలో ఆయనకు ఉన్న ఆదరణను దృష్టిలో పెట్టుకొని, ఎప్పుడూ చూడని కొత్త బాలకృష్ణ గారిని చూపించాలని, సినిమా మొదటి నుంచి ఎంతో శ్రద్ధతో పని చేస్తూ వచ్చాము. 
 
టీజర్ లో మీరు చూసింది చాలా చాలా తక్కువ. సినిమా ఇంకా వేరే స్థాయిలో ఉంటుంది. దర్శకుడిని నమ్మి స్వేచ్ఛను ఇస్తారు బాలకృష్ణ. అందుకే ఇంత అద్భుతమైన అవుట్ పుట్ వచ్చింది. నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతలకు, నాకు సహకరించిన బృందం అందరికీ ధన్యవాదాలు. చివరగా ఒక్క మాట.. యుద్ధం గట్టిగా ఉండబోతుంది" అన్నారు.
 
నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ, "బాలకృష్ణ గారిని చాలా కొత్తగా చూపించాలని నేను, దర్శకుడు బాబీ ముందు నుంచి అనుకుంటున్నాం. టీజర్ లో మీరు చూసింది చాలా చిన్నది. సినిమాలో ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. థియేటర్లలో ఈ సినిమా అభిమానులకు అసలుసిసలైన పండుగలా ఉంటుంది." అన్నారు.
 
సంగీత దర్శకుడు ఎస్. తమన్  మాట్లాడుతూ, "బాబీ చాలా గొప్ప సినిమా తీశారు. బాలయ్య గారితో ఇది నా ఐదవ సినిమా. ఆయనతో పని చేయడం సంతోషంగా ఉంది. సినిమా ఏదైతే కోరుకుంటుందో, దానికి తగ్గట్టుగా సంగీతం అందిస్తున్నాను. ఈ సినిమా అద్భుతంగా ఉంటుంది." అన్నారు.
 
'డాకు మహారాజ్' చిత్రం సంక్రాంతి కానుకగా 2025, జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రముఖ ఛాయాగ్రాహకుడు విజయ్ కార్తీక్ కన్నన్ కెమెరా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కళా దర్శకుడిగా అవినాష్ కొల్లా, ఎడిటర్ గా నిరంజన్ దేవరమానే వ్యవహరిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్, చైనాలకు వణుకు.. రష్యన్ R-37M క్షిపణిని కొనుగోలు చేయనున్న భారత్

Jagan: మూడు రోజులుగా ముగ్గుర్ని యువకుల్ని పోలీసులు హింసించారు.. జగన్ ఫైర్

Engineering student: పరీక్షల్లో అనుకున్న ఫలితాలు రాలేదు.. ఉరేసుకుని విద్యార్థి ఆత్మహత్య

Temperatures rise in AP: తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

Covid: తిరుపతిలో పది నెలల బాలికకు కోవిడ్-19: అన్నమయ్య జిల్లాలో ఓ వ్యక్తి పాజిటివ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments