మరోసారి వివాదంలో అలియాభట్‌.. కన్యాదానాన్ని విమర్శించి..?

Webdunia
శుక్రవారం, 24 సెప్టెంబరు 2021 (12:37 IST)
ఆర్‌ఆర్‌ఆర్ మూవీ హీరోయిన్, బాలీవుడ్ నటి అలియాభట్‌ని మరోసారి వివాదంలో చిక్కుకుంది. వివరాల్లోకి వెళితే.. ఇటీవల అలియా భట్.. క్లాథింగ్ బ్రాండ్ మాన్యవార్-మోహే యాడ్ లో నటించింది. మాన్యవార్ బ్రాండ్… షేర్వాణీలు, కుర్తాలు, నగలను తయారుచేసే విషయం తెలిసిందే. ఈ యాడ్‌లో హిందూ వివాహంలో ముఖ్యమైన క్రతువైనా.. కన్యాదానాన్ని విమర్శించింది. 
 
పెళ్లికూతుర్ని దానం చేయడాన్ని అలియా ప్రశ్నిస్తుంది. హిందువులు అమ్మాయిలను భారంగా చూస్తారనీ, ఆ భారాన్ని తొలిగించాలి. కన్యాదాన కార్యక్రమంలో వరుడి తల్లిదండ్రులు కూడా పాల్గొని, కన్యా మాన్ జరిపించాలని కోరింది. అమ్మాయిలు ఆస్తులు కాదని, వాళ్లకు కూడా గౌరవించాలని చెప్పుకొచ్చింది అలియాభట్. ఇప్పుడు ఈ యాడ్ అలియా భట్‌ని ఇబ్బందుల్లో పడేసింది. దుమారం రేగుతోంది. కన్యాదానం గురించి మాట్లాడిన తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
 
ఈ యాడ్‌పై చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా అలియాపై, ఆ నగల సంస్థపై మండిపడ్డారు. హిందు ఆచారాలను ప్రశ్నించడం సరికాదని, ఓ యాడ్ ఏజేన్సీ హైందవులకు నీతులు చెప్పటం హాస్యాస్పదమని ఆగ్రహం వ్యక్తం చేశారు. వేల ఏండ్లుగా భారతీయ సంస్కృతి, నాగరికత కొనసాగుతున్నాయని, పెళ్లికూతురుని మహాలక్ష్మీ స్వరూపంగా భావించే సాంప్రదాయం హిందువులది చురకలాంటించారు. ఈ యాడ్‌ను తక్షణం తొలగించాలి.
 
ఇదిలా ఉంటే.. బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్ కూడా ఈ యాడ్ పై ఘాటుగా స్పందించింది. యాడ్‌లో మతాన్ని, సంప్రాదాయాలను ప్రస్థావించడం సారికాదని ఫైర్‌ అయ్యింది. మరోవైపు అలియాను నెటిజన్లు ఆడుకుంటున్నారు. యాడ్‌ని మీమ్స్ గా మార్చి పోస్టులు పెడుతున్నారు. దీంతో ఇప్పుడు అలియా నేషనల్‌ వైడ్‌గా ట్రెండింగ్‌గా మారింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

డయల్ బిఫోర్ యు డిగ్ అని కోరుతున్న థింక్ గ్యాస్

ఒక్క రాత్రికి రూ. 10 వేలు ఇస్తా, నాతో పడుకుంటావా?: కామాంధుడికి దేహశుద్ధి (video)

IIT Bombay: హాస్టల్ బాత్రూమ్‌లో కెమెరాలు ఫిక్స్ చేసి చిక్కిన ఓల్డ్ స్టూడెంట్.. చివరికి?

కోడలు గర్భిణి.. అయినా చంపేశాడు... గొడ్డలి, కత్తితో దాడి చేసి..?

Nara Lokesh: ఆస్ట్రేలియాకు నారా లోకేష్.. దీపావళి బహుమతిని అలా తెస్తారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments