Webdunia - Bharat's app for daily news and videos

Install App

'గీత గోవిందం' గోవింద్ చెల్లికి అలీ చెప్పిన విషయం తెలిసి ఎగిరి గంతేసింది

Webdunia
శనివారం, 19 డిశెంబరు 2020 (18:13 IST)
న‌టుడు అలీ ఎంత స‌ర‌దాగా వుంటే విష‌యంలో అంత సీరియ‌స్‌గా వుంటాడు. దాదాపు 45 ఏళ్ళ సినీ కెరీర్‌లో ఎన్నో పాత్ర‌లు పోషించినా.. సినిమా నిర్మాణం వైపు మొగ్గుచూప‌లేదు. అందుకు సినీరంగంలోని పెద్ద‌ల అనుభ‌వాలే కార‌ణంగా చెబుతుంటాడు. అలాంటి వ్య‌క్తి తాజాగా ఓ సినిమాకు నిర్మాత‌గా మారాడు. స్వంత బేన‌ర్‌.. అలీ హుడ్‌.. అనేది నెల‌కొల్పి.. త‌న వారిని అందులో భాగ‌స్వామ్యం చేశాడు.
 
చెన్నైలో త‌న రూమ్‌మేట్‌.. స్నేహితుడు అయిన శ్రీ‌పురం కిర‌ణ్‌కు ద‌ర్శ‌క‌త్వం అవ‌కాశం క‌ల్పించారు. ఇంత అనుభ‌వం వున్న అలీ తీసుకున్న క‌థ‌. నేటి జ‌న‌రేష‌న్‌కు స‌రిప‌డా క‌థ‌గా మ‌ల‌యాళంలో వికృతి అనే సినిమాను ఎంచుకున్నాడు. ముందుగా సీనియ‌ర్ న‌రేష్‌కు చెప్ప‌డం, త‌ను ఓకే అన‌డం జ‌రిగిపోయింది. అయితే అలీ కూడా ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. అందులో ప‌రిమిత న‌టీన‌టులు.
 
అలీ స‌ర‌స‌న న‌టించాలంటే ఎవ‌రిని ఎంపిక చేయాల‌నే దాదాపు నెల‌పాటు త‌ర్జ‌న‌భ‌ర్జ‌న‌లు ప‌డి ఆరుగురిని ఎంపిక చేశారు. అందులో ఎవ‌రూ న‌చ్చ‌క‌పోవ‌డంతో.. చివ‌ర‌గా క్రాక్ సినిమాలో న‌టిస్తున్న మౌర్యానిపై దృష్టిప‌డింది. ఆమె గ‌తంలో గీత గోవిందం చేసిన అనుభ‌వం వుంది. అంత‌కుముందు అల్ల‌రి న‌రేశ్‌తో ఇంట్లో దెయ్యం.. సినిమాలో న‌టించింది. ఆమె ఫీచ‌ర్స్ త‌న సినిమాకు బాగా ప‌నికి వ‌స్తాయ‌ని అలీ స‌జెస్ట్ చేయ‌డంతో, వెంట‌నే ద‌ర్శ‌క‌త్వం బృందం రంగంలోకి దిగి ఆమెను ఎంపిక చేసింది. ఓపెనింగ్ రోజే ఆమెకు అస‌లు విష‌యం తెలిసింది.
ద‌ర్శ‌క‌త్వం బృందం అంతా ఆమె వైపే మొగ్గు చూప‌డం ఒక‌ట‌యితే, అలీ కూడా మీ పేరు స‌జెస్ట్ చేశార‌ని చెప్ప‌గానే మౌర్యాని ఉబ్బిత‌బ్బిబ్బయింది. సీనియ‌ర్ ఆర్టిస్టుతో క‌లిసి న‌టించే అవ‌కాశం అందులో మెయిన్ లీడ్ అన‌గానే.. భ‌విష్య‌త్ బాగుంటుంద‌ని ఆశ‌తో వుంది. గతంలో ఆమె ఎక్స్‌పోజింగ్ కూడా రెడీ అయింది. అల్ల‌రి న‌రేశ్ సినిమా ప్ర‌మోష‌న్‌లో ఆమె ఈ డ్రెస్‌తో వ‌చ్చి అంద‌రినీ అల‌రించింది. ముందుముందు అటువంటి పాత్ర‌ల‌కు సిద్ధ‌మేన‌ని గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో ఒక రోజు ముందుగానే సామాజిక పింఛన్ల పంపిణీ.. నేమకల్లుకు సీఎం బాబు

ఆంధ్ర నుంచి ఆఫ్రికాకు రేషన్ బియ్యం, కాకినాడ పోర్టు స్మగ్లింగ్ కేంద్రంగా మారిందా?

రేవంత్ రెడ్డి "ఏఐ సిటీ"కి శంకుస్థాపన ఎప్పుడో తెలుసా?

హైదరాబాద్‌- 50వేల కేసులు, రూ.10.69 కోట్ల ఫైన్.. 215మంది మృతి

12 అడుగుల భారీ గిరినాగు.. రక్తపింజరను మింగేసింది.. ఎలా పట్టుకున్నారంటే? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం
Show comments