Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ 'అల... వైకుంఠపురములో' “ఓ డాడీ” సాంగ్ విడుదల

Webdunia
శనివారం, 23 నవంబరు 2019 (16:39 IST)
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, మాటల మాంత్రికుడు, సుప్రసిద్ధ సినీ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘అల వైకుంఠపురములో…’ వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న హ్యాట్రిక్ సినిమా కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. పలు విజయవంతమైన చిత్రాల్ని అందించిన భారీ నిర్మాణ సంస్థలు ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’, ‘గీతాఆర్ట్స్’ కాంబినేషన్లో ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల అవుతోందని చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది.
 
ఇటీవలే విడుదల చేసిన ‘సామజవరగమన’, “రాములో రాముల” పాటలు చిత్రం పై అంచనాల్ని తారాస్థాయికి చేర్చాయి. ఈ పాటలు ఎంతటి సంచలనం సృష్టించాయో తెలిసిందే. ఇప్పుడు సంగీత దర్శకుడు థమన్ స్వరపరచిన చిత్రంలోని మరోగీతం ‘ఓ డాడీ’ విడుదలైంది. సాహిత్య విలువలతో కూడిన,ఎన్నో విజయవంతమైన గీతాలను రచించిన గీత రచయిత కృష్ణ చైతన్య ఈ పాట రాసారు. 
 
ఈ పాటలో వచ్చే తెలుగు ర్యాప్ కూడా ఆయనే రాయడం విశేషం. తెలుగు ర్యాప్‌ని బిగ్ బాస్ ఫేమ్ రోల్ రైడా పాడగా, ఇంగ్లీష్ ర్యాప్‌ని ‘రాహుల్ నంబియార్’ పాడారు. ఫిమేల్ ర్యాప్‌ని లేడీ కాష్ పాడింది. గాయకుడు ‘రాహుల్ సిప్లిగంజ్’ ఈ పాటను తన స్టయిల్‌లో పాడి ఉర్రూతలూగించారు.. బ్లాజీ ఈ పాటకు గాత్ర సాయం చేశారు.
 
‘ఓ డాడీ’ గీతం విడుదలైన కొద్ది సమయానికే అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. సోషల్ మీడియాలో మరో ఫేవరేట్ సాంగ్‌గా చార్ట్ బస్టర్స్‌లో టాప్‌లో నిలుస్తోంది. మరో అద్భుతమైన పాటను అందించి, మరొక సూపర్ హిట్ ఆల్బమ్‌ను తన ఖాతాలో థమన్ వేసుకున్నారన్న ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pawan Kalyan: చంద్రబాబు, మంద కృష్ణ మాదిగను ప్రశంసించిన పవన్ కళ్యాణ్

నా భర్తతో పడుకో, నా ఫ్లాట్ బహుమతిగా నీకు రాసిస్తా: పని మనిషిపై భార్య ఒత్తిడి

పురుషులకు వారానికి రెండు మద్యం బాటిళ్లు ఇవ్వాలి : జేడీఎస్ ఎమ్మెల్యే డిమాండ్

బీజాపూర్ - కాంకెర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ - 22 మంది మావోలు హతం

ఎస్వీ యూనివర్శిటీ విద్యార్థికి రూ.2.5 కోట్ల ప్యాకేజీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments