Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్లు అర్జున్ బుట్టబొమ్మ సాంగ్ రిలీజ్... డ్యాన్స్ అదిరిపోయింది...

Webdunia
బుధవారం, 8 జనవరి 2020 (13:59 IST)
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో ముచ్చటగా మూడోసారి వస్తున్న చిత్రం అల వైకుంఠపురములో. వీరిద్దరి కాంబినేషన్‌లో గతంలో వచ్చిన జులాయ్, సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఇపుడు మూడో చిత్రంగా అల వైకుంఠపురములో చిత్రం ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకురానుంది. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. 
 
ఎస్ఎస్ థమన్ సంగీత బాణీలు సమకూర్చిన ఈ చిత్రంలోని పాటలను ఇటీవలే విడుదల చేశారు. ముఖ్యంగా, సామ‌జ‌వ‌ర‌గ‌మనా, రాములో రాములా, ఓ మై గాడ్ డాడీ, బుట్ట‌బొమ్మ‌ అనే సాంగ్స్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. 
 
తాజాగా బుట్ట‌బొమ్మ సాంగ్ ప్రోమో వీడియో విడుద‌ల చేశారు. ఇందులో అల్లు అర్జున్, పూజా స్టైలిష్ లుక్‌లో క‌నిపిస్తున్నారు. బ‌న్నీ వేసే స్టెప్స్ ఫ్యాన్స్‌కి మాంచి కిక్ ఇస్తున్నాయి. సాంగ్‌లో సెట్ చాలా అందంగా క‌నిపిస్తుంది. రామ‌జోగ‌య్య శాస్త్రి ఈ పాట‌కి లిరిక్స్ అందించ‌గా, ఆర్మాన్ మాలిక్ పాట పాడారు.
 
ఇకపోతే, ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్‌, హారిక అండ్ హాసిని బ్యానర్లపై ఈ సినిమాను అల్లు అరవింద్, ఎస్ రాధాకృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో సీనియర్ నటి టబు, నట కిరీటి రాజేంద్రప్రసాద్, సచిన్ ఖేడ్‌కర్, తనికెళ్ళ భరణి, మురళీ శర్మ, సముద్రఖని, జయరాం, సునీల్, నవదీప్, సుశాంత్, నివేతా పేతురాజ్ తదితరులు నటించారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మయన్మార్‌లో భారీ భూకంపం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసు : వల్లభనేని వంశీకి మళ్లీ నిరాశ

ఉద్యోగం కోసం కీచులాటల్లో భార్యను హత్య చేసాడా? భార్యాభర్తల కాల్ డేటా చూస్తున్నారా?

త్రిభాషా విద్యా విధానం వద్దు.. ద్విభాషే ముద్దు... వక్ఫ్ బిల్లు రద్దు చేయాలి : విజయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments