Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.కోట్లు కుమ్మరిస్తున్న "అల వైకుంఠపురములో..."

Webdunia
గురువారం, 16 జనవరి 2020 (08:55 IST)
ఈ సంక్రాంతికి విడుదలైన చిత్రాల్లో "అలా వైకుంఠపురములో". స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రం జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పూజా హెగ్డే హీరోయిన్ కాగా, టబు, జయరాం, సముద్రఖని, రాజేంద్రప్రసాద్ వంటి అగ్రనేతలు నటించారు. 
 
ప్రస్తుతం ఈ చిత్రం విడుదలైన ప్రతి కేంద్రంలోనూ కనకవర్షం కురిపిస్తూ సరికొత్త రికార్డులు నెలకొల్పుతూ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఈ రికార్డుల్లో భాగంగా బుధవారం మధ్యాహ్నం మ్యాట్నీ షోతో ఈ చిత్రం రూ.100 కోట్ల గ్రాస్‌ను రాబట్టినట్టు ఫిల్మ్ ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. 
 
ఈ చిత్రం 12వ తేదీన విడుదల కాగా, తొలి మూడు రోజుల్లో రూ.90 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఈ చిత్రానికి ముందు 'దర్బార్', 'సరిలేరు నీకెవ్వరు' వంటి చిత్రాలు విడుదలైనప్పటికీ... వీటికి సరైన పోటీ ఇస్తూ కాసుల వర్షం కురిపిస్తోంది. 
 
ఇప్పటికీ నూరు శాతం ఆక్యుపెన్సీతో చిత్రం నడుస్తోందని సినీ వర్గాలు అంటున్నాయి. ఇక సినిమా అంతర్జాతీయ హక్కులను రూ.85 కోట్లకు విక్రయించగా, ఇప్పటివరకూ రూ.60 కోట్లకు పైగానే కలెక్షన్లు వచ్చాయని, మరో రెండు రోజుల్లో పూర్తిస్థాయి కలెక్షన్లు వస్తాయని బయ్యర్లు అభిప్రాయపడుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

12 మంది పిల్లలపై లైంగిక వేధింపులు.. భారత సంతతి టీచర్ అరెస్ట్.. విడుదల

మార్చి 19న ఐఎస్ఎస్ నుంచి భూమికి రానున్న సునీతా విలియమ్స్, విల్మోర్

BMW Hits Auto Trolley: ఆటో ట్రాలీని ఢీకొన్న బీఎండబ్ల్యూ కారు.. నుజ్జు నుజ్జు.. డ్రైవర్‌కి ఏమైందంటే? (video)

తలపై కత్తిపోట్లు, నోట్లో యాసిడ్ పోసాడు: బాధతో విలవిలలాడుతున్న బాధితురాలిపై అత్యాచారం

దువ్వాడ శ్రీనివాస్, దివ్యల మాధురిల వాలెంటైన్స్ డే వీడియో- ఒక్కరోజు భరించండి (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహం వ్యాధికి మెంతులు అద్భుతమైన ప్రయోజనాలు

మునగ ఆకుల టీ ఒక్కసారి తాగి చూడండి

దొండ కాయలు తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

హైదరాబాద్ వేడి వాతావరణం, భౌగోళిక పరిస్థితులు డీహైడ్రేషన్ ప్రమాదంలో పడేస్తున్నాయి: హెచ్చరిస్తున్న నిపుణులు

బీట్ రూట్ జ్యూస్ ఉపయోగాలు

తర్వాతి కథనం
Show comments