Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్షయ్ కుమార్ పెద్ద మనసు : ముంబై పోలీసు ఫౌండేషన్‌కు రూ.2 కోట్లు

Webdunia
సోమవారం, 27 ఏప్రియల్ 2020 (17:38 IST)
బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్‌ మరోమారు పెద్ద మనసు చాటాడు. మరోమారు భారీ మొత్తంలో విరాళం ప్రకటించారు. ముంబై పోలీసు ఫౌండేషన్‌కు అక్షయ్ కుమార్ రూ.2 కోట్లు విరాళంగా ఇచ్చారు. దీనిపై పోలీస్ కమిషనర్ ఓ ట్వీట్‌లో ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. 
 
'నిరంతరం ప్రజా రక్షణకు పాటుపడుతున్న పోలీసు సిబ్బందికి మీ విరాళం ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుంది. మరింత నిబద్ధతతో పనిచేసేందుకు ప్రేరణనిస్తుంది. ముంబై పోలీస్ ఫౌండేషన్ తరపున మీకు కృతజ్ఞతలు' అని ఆయన ట్వీట్ చేశారు.
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, కరోనా వైరస్‌తో పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు ముంబై పోలీసు కానిస్టేబుల్స్‌కు నివాళులు తెలియజేశారు. 'కరోనాతో పారాటంలో ప్రాణాలు కోల్పోయిన కానిస్టేబుళ్లు చంద్రకాంత్ పెండూర్కర్, సందీప్ సుర్వేకు సెల్యూట్ చేస్తున్నాను. నా కర్తవ్యం నేను చేశాను. మీరు కూడా ముందుకు వస్తారని ఆశిస్తున్నాను. అలాంటి త్యాగధనుల వల్లే నేనూ, మీరూ క్షేమంగానే ఉన్నామనే విషయాన్ని మనం మరిచిపోరాదు' అని తన ట్వీట్‌లో పేర్కొన్నారు. 
 
కాగా, కోవిడ్ నేపథ్యంలో వ్యక్తిగత రక్షణా సామగ్రి, మాస్క్‌లు, ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ల కోసం బృహాన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్‌ (బీఎంసీ)కు అక్షయ్ కుమార్ ఇటీవల రూ.3 కోట్లు విరాళం ఇచ్చారు. కోవిడ్‌-19పై పోరాటానికి ఏర్పాటు చేసిన 'పీఎం కేర్స్ ఫండ్'కు కూడా రూ.25 కోట్ల విరాళాన్ని అక్షయ్ ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments