Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయవాడ లోక్‌సభ బరిలో అక్కినేని నాగార్జున?

Webdunia
శుక్రవారం, 30 సెప్టెంబరు 2022 (19:28 IST)
టాలీవుడ్ 'మన్మథుడు', అగ్రహీరో అక్కినేని నాగార్జున విజయవాడ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయబోతున్నట్టు జోరుగా ప్రచారం సాగుతోంది. వచ్చే 2024లో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన ఓ పార్టీ తరపున పోటీ చేయనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ వార్తలపై నాగార్జున స్పందించారు. తనకు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచనే లేదని స్పష్టం చేశారు. ఎపుడు ఎన్నికలు వచ్చినా ఇదే తరహాలో ప్రచారం చేస్తున్నారంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 
 
కాగా, ఏపీలోని అధికార వైకాపా అధినేత, సీఎం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో హీరో నాగార్జునకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో నాగార్జున వైకాపా తరపున విజయవాడ లోక్‌సభ స్థానం నుంచి వైకాపా అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారంటూ కొన్ని రోజులుగా ప్రచారం సాగుతోంది. 
 
కాగా, గత 2014, 2019 ఎన్నికల్లో ఇక్కడ నుంచి బరిలోకి  దిగిన వైకాపా అభ్యర్థి ఓడిపోయిన విషయం తెల్సిందే. ఈ రెండు ఎన్నికల్ల టీడీపీ అభ్యర్థి గెలుపొందారు. ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా కేశినేని నాని కొనసాగుతున్నారు. 
 
ఈ క్రమంలో వచ్చే 2024లో జరిగే ఎన్నికల్లో విజయవాడ లోక్‌సభ సీటును ఎలాగైనా గెలుచుకోవాలన్న పట్టుదలతో సీఎం జగన్ ఉన్నారు. అందుకే మంచి సెలెబ్రిటీని బరిలోకి దించే తలంపులో ఉన్నట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భార్యాభర్తల గొడవ.. భర్తను చంపి ఇంటి వెనక పాతి పెట్టింది..

Bhubaneswar: పసికందుకు 40సార్లు వేడి ఇనుప రాడ్‌తో వాతలు పెట్టారు

ఇక్కడ భయంగా ఉంది.. వేరే బ్యారక్‌కు మార్చండి.. వంశీ పిటిషన్

ఎమ్మెల్సీ ఎన్నికలు : కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ గెలుపు - కామెంట్స్

శ్వేతసౌథంలో ట్రంప్‍తో మాటల యుద్ధం.. ఉక్రెయిన్‌కు ఆగిన సాయం!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షను నీటిలో నానబెట్టి తింటే...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments