Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ‌ర్వానంద్ సినిమాలో న‌టిస్తున్న అక్కినేని అమ‌ల‌, ఇంత‌కీ పాత్ర ఏంటి?

Webdunia
శనివారం, 2 నవంబరు 2019 (20:07 IST)
శ‌ర్వానంద్ హీరోగా ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియ‌ర్ పిక్చర్స్ బ్యాన‌ర్‌పై శ్రీకార్తీక్ ద‌ర్శ‌క‌త్వంలో ఎస్‌.ఆర్‌.ప్ర‌కాశ్‌బాబు, ఎస్‌.ఆర్‌.ప్ర‌భు ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగ‌తి తెలిసిందే. శుక్ర‌వారంనాడు ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ షూటింగ్ హైద‌రాబాద్‌లో ప్రారంభ‌మైంది. అమ‌ల అక్కినేని ఈ చిత్రంలో శ‌ర్వానంద్ త‌ల్లి పాత్ర‌లో న‌టిస్తుంటే.. ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు అనిరుధ్ ర‌విచంద్ర‌న్ తండ్రి, న‌టుడు ర‌వి రాఘ‌వేంద్ర హీరో తండ్రి పాత్ర‌లో న‌టిస్తున్నారు. 
 
సెల‌క్టివ్ సినిమాల్లోనే న‌టించే అమ‌ల అక్కినేని, క‌థ‌, త‌న పాత్ర న‌చ్చ‌డంతో ఈ సినిమాలో యాక్ట్ చేయ‌డానికి ఒప్పుకున్నారు. ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో శ‌ర్వానంద్‌, అమ‌ల అక్కినేని, ర‌వి రాఘ‌వేంద్ర పాత్ర‌ల మ‌ధ్య కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు. `పెళ్ళిచూపులు` ఫేమ్ రీతూవ‌ర్మ హీరోయిన్‌గా న‌టిస్తున్నారు. నాజ‌న్‌, వెన్నెల కిషోర్‌, ప్రియ‌ద‌ర్శి ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. 
 
స్నేహం, ప్రేమ మ‌ధ్య విడ‌దీయ‌రాని బంధాన్ని తెలియ‌జేసేలా ఈ చిత్రం ఉంటుంది. ఈ చిత్రానికి త‌రుణ్ భాస్క‌ర్ మాట‌లు అందిస్తున్నారు. జాక్స్ బిజోయ్ సంగీతాన్ని, సుజిత్ సారంగ్ సినిమాటోగ్ర‌ఫీని అందిస్తున్నారు. రీసెంట్‌గా `ఖైదీ` చిత్రంతో తెలుగు, త‌మిళ భాష‌ల్లో స‌క్సెస్‌ను సాధించిన నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్ ఈ చిత్రాన్ని కూడా తెలుగు, త‌మిళ భాష‌ల్లోనే నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2020 స‌మ్మ‌ర్‌లో గ్రాండ్ రిలీజ్ చేయ‌డానికి నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments