అల్లరి, నచ్చావులే, అనసూయ, అవును, అవును 2.. ఇలా విభిన్న కథలతో సినిమాలు తెరకెక్కించే టాలెంటెడ్ డైరెక్టర్ రవిబాబు తెరకెక్కించిన తాజా చిత్రం ఆవిరి. రవిబాబు, నేహా చౌహాన్, శ్రీముక్త, భరణి శంకర్, ముక్తార్ ఖాన్ నటించిన ఈ చిత్రం నవంబర్ 1న విడుదల అయ్యింది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మీడియాతో మాట్లాడిన రవిబాబు ఓ ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టారు.
ఇంతకీ అది ఏంటంటే... వరంగల్‌లో జరిగిన ఒక సంఘటన ఈ సినిమాకి స్ఫూర్తి అని చెప్పారు రవిబాబు. వరంగల్ కలెక్టర్ ఆమ్రపాలి ఇంట్లో దెయ్యం ఉందనే కథనాన్ని పేపర్‌లో చూశాను. ఆ స్టోరీ చదివిన తర్వాత నాకొక ఆలోచన వచ్చింది. ఐతే ఇదొక ఫిక్షనల్ స్టోరీ. ఆమ్రపాలి జీవితానికి దీనికి సంబంధం లేదు అన్నారు.
ఆవిరి` సినిమా హారర్ సినిమా కాదు. ఫ్యామిలీ థ్రిల్లర్. నేను ఇంతకుముందు తీసిన సినిమాలన్నీ కూడా థ్రిల్లర్ సినిమాలే. కథను చెప్పడంపైనే నేను ఫోకస్ పెడతాను. ప్రేక్షకులను ఏదో భయపెట్టాలని ఆలోచించను. ప్రేక్షకులను భయపెడితేనే ప్రేక్షకులు థ్రిల్ అవుతారని ఎప్పుడూ అనుకోలేదు. ఇది ఖచ్చితంగా ప్రేక్షకులకు నచ్చుతుంది. మా టీమ్‌కి విజయాన్ని అందిస్తుంది అని నమ్మకాన్ని వ్యక్తం చేసారు రవిబాబు.