Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైజాగ్ పోర్ట్‌లో అఖిల్‌కు బైక్ భారీ ర్యాలీతో స్వాగ‌తం

Webdunia
సోమవారం, 11 ఏప్రియల్ 2022 (17:34 IST)
Akil akkineni
అక్కినేని అఖిల్ హీరోగా స్టయిలీష్ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అనిల్ సుంకర ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌, సురేందర్ 2 సినిమా బ్యానర్స్ పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ 'ఏజెంట్' సినిమా షూటింగ్ కొత్త షెడ్యూల్ వైజాగ్ పోర్ట్‌లో మొదలైయింది. ఈ షెడ్యూల్‌లో భారీ యాక్షన్ ఎపిసోడ్స్ చిత్రీకరించనున్నారు.
 
షూటింగ్‌లో భాగంగా వైజాగ్ చేరుకున్న హీరో అఖిల్‌కు ఎయిర్ పోర్ట్ లో అభిమానులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. అఖిల్‌ని చూడటానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ఫ్యాన్స్ బైక్ భారీ ర్యాలీ నిర్వహించి తమ అభిమానం చాటుకున్నారు.  అభిమానులు నుంచి వస్తున్న ఈ భారీ స్పందన అఖిల్ కి  వున్న క్రేజుకి అద్దం పడుతుంది.
 
హై వోల్టేజ్ స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం అఖిల్ పూర్తిగా మేకోవ‌ర్ అయ్యారు.  ఏజెంట్‌గా అఖిల్ లుక్ అందరిలో ఆసక్తిని పెంచుతుంది. తాజాగా అఖిల్ బర్త్ డే కానుకగా విడుదల చేసిన పోస్టర్‌కి కూడా మంచి స్పందన వచ్చింది.  
 
ఈ చిత్రంలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అఖిల్ సరసన సాక్షి వైద్య కథానాయికగా నటిస్తోంది. ప్రముఖ రచయిత, దర్శకులు వక్కంతం వంశీ ఈ చిత్రానికి కథ అందించారు.
 
ఈ చిత్రానికి హిప్ హాప్ తమిజా సంగీతం అందించగా, రసూల్ ఎల్లోర్ ఛాయాగ్రహకుడిగా పని చేస్తున్నారు. నవీన్ నూలి ఎడిటర్‌గా, అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.
అజయ్ సుంకర, దీపా రెడ్డి ఈ చిత్రానికి సహ నిర్మాతలు.
తారాగణం: అక్కినేని అఖిల్, సాక్షి వైద్య, మమ్ముట్టి

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

'విశ్వ సుందరి'గా డెన్మార్క్ అందాల భామ

ఆవు పేడ కుప్పలో రూ.20 లక్షల నోట్లు

గుంటూరు మేయరుపై కేసు నమోదు... అరండల్ పేట పోలీసులకు ఫిర్యాదు

లేడీ టీచర్ కుర్చీ కింద బాంబు అమర్చి రిమోట్‌తో పేల్చిన విద్యార్థులు.. ఎక్కడ?

రూ.25 లక్షలు లంచం పుచ్చుకుంటూ పట్టుబడిన డీఆర్ఎం సౌరభ్ ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడం కొన్ని బాదంపప్పులు తినండి

దుమ్ము లేదా డస్ట్ అలర్జీ ఉందా? ఐతే ఇలా చేయండి

తర్వాతి కథనం
Show comments