Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హైద‌రాబాద్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ పార్టీ షాటీ

Advertiesment
హైద‌రాబాద్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ పార్టీ షాటీ
, గురువారం, 21 అక్టోబరు 2021 (19:02 IST)
Akil, Arvind, Bhaskar and others
అఖిల్ అక్కినేని, పూజ హెగ్డే హీరో జంట‌గా న‌టించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ పొందుతోంది. ఆంధ్ర‌, తెలంగాణాల‌లో వంద‌శాతం థియేట‌ర్ ఆక్సుపెన్సీ రావ‌డం క‌లిసి వ‌చ్చిన అంశం. దానికితోడు యూ ఎస్ లో ఈ చిత్రం హాఫ్ మిలియన్ డాలర్స్ ను కలెక్ట్ చేయడం జరిగింది. వీట‌న్నింటిని పుర‌స్క‌రించుకుని చిత్ర‌యూనిట్ హైద‌రాబాద్‌లో పార్టీ షాటీ జ‌రుపుకున్నారు.
 
నిన్న రాత్రి జ‌రిగిన ఈవేడుక‌లో చిత్ర యూనిట్ అంతా పాల్గొన్నారు. హైద‌రాబాద్ లోని ఓప‌బ్‌లో ఈ పార్టీ జ‌రిగింది. అల్లు అర‌వింద్‌తోపాటు బొమ్మరిల్లు భాస్కర్, పూజా, అఖిల్‌తోపాటు పంపిణీదారులు కూడా పాల్గొన్నారు. ఈ సినిమా విడుద‌లైన మొద‌టి రోజునుంచే పాజిటివ్ టాక్ నెల‌కొంది.

webdunia
most collections
అయితే సినిమాలో చిన్న లోపం వున్నా దాన్ని ఎవ్వ‌రూ ప‌ట్టించుకోక‌పోవ‌డం విశేషం. ర‌న్నింగ్ లో దాన్ని మ‌ర్చిపోవ‌డంతో తామూ పెద్ద‌గా ఆలోచించ‌లేద‌ని ద‌ర్శ‌కుడు తెలియ‌జేస్తున్నారు. దానికి వివ‌ర‌ణ‌గా ఓ సీన్ చేశామ‌నీ, కాని ఓవ‌ర్‌లుక్‌తో అది మ‌ర్చిపోయాయ‌మ‌ని ఆయ‌న తెలియ‌జేశారు. ఏదిఏమైనా ఈ సినిమా విజ‌య‌వంతం కావ‌డం చాలా ఆనందంగా వుంద‌ని తెలియ‌జేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆర్యన్‌కు రిమాండ్ పొడగింపు - బెయిల్ కోసం బాంబే హైకోర్టుకు