Webdunia - Bharat's app for daily news and videos

Install App

కథల ఎంపికలో బోల్తాపడుతున్న హీరో అఖిల్ అక్కినేని!!

Webdunia
ఆదివారం, 13 ఆగస్టు 2023 (13:09 IST)
హీరో అక్కినేని నాగార్జున కుమారుడు, అక్కినేని వారసుడు అఖిల్ అక్కినేని‌ కేరీర్‌లో ఒక్కటైనా మంచి హిట్ లేదు. దీనికి కారణం.. ఆయన కథల ఎంపికలో బోల్తాపడటమేనని సినీ ప్రముఖులు అంటున్నారు. ముఖ్యంగా, లవ్ స్టోరీలు, ఫాంటసీలు, యాక్షన్ డ్రామాలూ ఇలా ఏం చేసినా ఆయనకు ఏమాత్రం కలిసి రావడంలేదు.
 
భారీ బడ్జెట్‌తో రూపొందించిన "ఏజెంట్" సైతం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ఈ ఫ్లాఫ్‌లతో అఖిల్ మరింత ఆలోచనలో పడ్డాడు. ఈసారి ఏ జోనర్‌లో  సినిమా చేయాలి? ఏ దర్శకుడిని ఎంచుకోవాలి? అనే విషయాల్లో తీవ్ర తర్జన భర్జనల్లో ఉన్నాడు. తన దృష్టి ఇప్పుడు ఫ్యామిలీ ఎంటరైనర్‌పై పడిందని టాక్. కుటుంబ కథా చిత్రంలో నటిస్తే.. సేఫ్ జోనర్ అవుతుందని భావిస్తున్నాడట. 
 
ఈ తరహా కథలకు శ్రీకాంత్ అడ్డాల కేరాఫ్ అడ్రస్. శ్రీకాంత్ కూడా ఓ మంచి ప్రాజెక్ట్, కాంబో కోసం ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఆయన 'పెద్దకాపు' సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేస్తున్నారు. ఆ తర్వాత ప్రాజెక్ట్ అఖిల్‌తో ఉండొచ్చని టాక్. యూవీ క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించబోతోంది. ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ కాంబోపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇన్‌స్టా యువకుడి కోసం బిడ్డను బస్టాండులో వదిలేసిన కన్నతల్లి

ట్యూటర్‌తో అభ్యంతరకర స్థితిలో కోడలు ఉన్నట్టు నా కొడుకు చెప్పాడు...

వైకాపా పాలనలో జరిగిన నష్టాన్ని వడ్డీతో సహా తెస్తాం : మంత్రి నారా లోకేశ్

హరిద్వార్ మానసాదేవి ఆలయంలో తొక్కిసలాట.. భక్తుల మృతి

బెంగుళూరు తొక్కిసలాట : మృతదేహంపై బంగారు ఆభరణాలు చోరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments