Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ : భారత్ ముందు పాకిస్థాన్ కొండత లక్ష్యం

pak youth team
, ఆదివారం, 23 జులై 2023 (18:47 IST)
ఎమర్జింగ్ టైమ్స్ ఆసియా కప్ టోర్నీలో భాగంగా భారత్, పాకిస్థాన్ జట్ల కీలక మ్యాచ్ జరుగుతుంది. శ్రీలంక వేదికగా జరుగుతున్న ఈ ఫైనల్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల 352 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన పాకిస్థాన్ బ్యాటింగ్ చేపట్టింది. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ ఓపెనర్లు సయీమ్ అయూబ్ (59), సాహిబ్ జాదా ఫర్హాన్ (65) తొలి వికెట్‌కు 121 పరుగులు జోడించి శుభారంభం అధించారు. ఈ దశలో భారత బౌలర్లు విజృంభించడంతో ఒక దశలో పాకిస్థాన్ 187 పరుగులు చేసి కష్టాల్లో పడింది. 
 
కానీ మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్ తయ్యబ్ తాహిర్ అద్భుతంగా ఆడి సెంచరీ సాధించడమే కాకుండా పాకిస్థాన్ భారీ స్కోరుకు బాటలు వేసింది. తాహిర్ 71 బంతుల్లో 12 ఫోర్లు, 4 భారీ సిక్సులతో విరుచుకుపడి 108 పరుగులు సాధించడం పాక్ ఇన్నింగ్స్‌లో హైలెట్‌గా నిలిచింది. ఒమర్ యూసఫ్ (35), ముబాసిర్ ఖాన్ (35) రాణించగా, టెయిలెండర్లు మహ్మద్ వాసిం జూనియర్ (17 నాటౌట్), మెహ్రాన్ ముంతాజ్ (13) కూడా తమ వంతు సహకారం అందించడంతో పాకిస్థాన్ స్కోరు 350 మార్కును దాటింది. భారత బౌలర్లలో హంగార్కేకర్, రియాన్ పరాగ్ రెండేసి వికెట్లు, హర్షిన్ రాణా, మానవ్ సుతార్‌, నిషాంత్ సింధు ఒక్కో వికెట్ చొప్పున తీశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స్నేహితురాలిని పెళ్లి చేసుకున్న సన్ రైజర్స్ కెప్టెన్ మార్‌క్రమ్