Webdunia - Bharat's app for daily news and videos

Install App

అఖిల్ అక్కినేని ఏజెంట్ ఆగస్టు 12న రిలీజ్‌

Webdunia
శుక్రవారం, 11 మార్చి 2022 (16:15 IST)
Agent still
హీరో అఖిల్ అక్కినేని, స్టైలిష్ మేకర్ సురేందర్ రెడ్డిల హై బడ్జెట్ స్టైలిష్, యాక్షన్ థ్రిల్లర్ చిత్రం `ఏజెంట్. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ప‌వ‌ర్‌ఫుల్‌ పాత్రలో న‌టిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుపుకుంటోంది.
 
శుక్ర‌వారంనాడు మేకర్స్ సినిమా థియేట్రికల్ విడుద‌ల తేదీని ప్రకటించారు. `ఏజెంట్` చిత్రం స్వాతంత్ర దినోత్సవానికి మూడు రోజుల ముందు ఆగస్టు 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం దేశభక్తి అంశాలతో రూపొందుతోంది కాబట్టి, స్వాతంత్ర‌దినోత్సవం విడుదలకు అనువైన సమయంగా భావించారు. అంతేకాక‌ ఆగస్ట్ 15వ తేదీ సోమవారం కావడంతో  4 రోజుల వీకెండ్ కూడా క‌లిసి వ‌చ్చింది.
 
`ఏజెంట్‌`లో అఖిల్ యాక్షన్-ప్యాక్డ్ రోల్‌లో కనిపించ‌నున్నాడు. ఇందులో అతనిలోని సరికొత్త పార్శ్వం కనిపిస్తుంది. మరోవైపు ఈ సినిమాలో మమ్ముట్టి కూడా పవర్‌ఫుల్ రోల్‌లో నటిస్తున్నాడు.
 
స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అఖిల్ సరసన సాక్షి వైద్య కథానాయికగా నటిస్తోంది. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి వక్కంతం వంశీ కథ అందించారు.
 
సెన్సేషనల్ కంపోజర్ హిప్ హాప్ తమిజా సంగీతం అందించగా, రసూల్ ఎల్లోర్ సినిమాటోగ్ర‌ఫీ బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్‌గా, అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. అజయ్ సుంకర, పతి దీపా రెడ్డి ఈ చిత్రానికి సహ నిర్మాతలు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నాకెందుకు ఇంత తక్కువ మార్కులొచ్చాయ్: ఉపాధ్యాయురాలికి విద్యార్థి చెంపదెబ్బ (video)

స్నానాల గదిలో 16 అడుగుల గిరి నాగుపాము, స్నేక్ క్యాచర్స్ క్యాచ్ (video)

ఇన్‌స్టా పరిచయం.. పలుమార్లు అత్యాచారం.. వాంతులు చేసుకోవడంతో గర్భవతి.. చివరికి?

ఫిర్యాదు చేసేందుకు వచ్చిన మహిళకు దుస్తులు విప్పి ఎస్సై అసభ్యకర వీడియో కాలింగ్

Manchu Lakshmi: ఈడీ ఎదుట హాజరైన మంచు లక్ష్మీ ప్రసన్న

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments