Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్లీజ్... నా కుమార్తెను వదిలేయండి: ట్రోలర్స్‌కు అజయ్ దేవగణ్ వేడుకోలు

Webdunia
మంగళవారం, 9 ఏప్రియల్ 2019 (17:16 IST)
ఎంత సినీ హీరో అయినా... తాను కూడా తండ్రినే అంటున్నాడు బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్. ఈ మేరకు తన కుమార్తె శరీరాకృతి గురించి, ఆమె ధరించిన దుస్తులను గురించి... ట్రోల్ చేస్తున్న వారికి ఆయన తన సమస్యని విన్నవించుకున్నారు.
 
వివరాలలోకి వెళ్తే... తన కుమార్తె వయసు కేవలం 14 సంవత్సరాలు మాత్రమేనని, తన శరీరాకృతి, వేసుకునే దుస్తులపై వస్తున్న కామెంట్లతో ఆమె ఏడుస్తోందని బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ వాపోవడం
జరిగింది. తన పిల్లల ఫొటోలు తీసి వాటిని పబ్లిష్ చేయవద్దని మీడియాను కోరిన అజయ్, ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటే నెగటివ్ కామెంట్లు వస్తున్నాయని తెలియజేసారు. తనకున్న పాపులారిటీతో తన పిల్లలు ఇబ్బంది పడుతున్నారనీ, మీడియా తమపై చూపుతున్న అధిక శ్రద్ధపై వారు అసహనంతో ఉంటున్నారని అన్నారు.
 
మీడియా తీస్తున్న ఫొటోల్లో తాము సరిగ్గా కనిపించమేమోనన్న ఆందోళన వారిలో నెలకొని వుందనీ, ఇక ట్రోల్ చేస్తున్న వారైతే... పిల్లలన్న సంగతిని కూడా మరిచి.. అసభ్య కామెంట్లు పెట్టేస్తూంటే వాటిని చూసి పిల్లలు చాలా బాధపడుతున్నారనీ అన్నారు. తాను, తన భార్య సెలబ్రిటీలం కాబట్టి ఎవరు ఏమన్నా పట్టించుకోబోమనీ, కానీ తమ పిల్లలు చేసిన పాపం ఏమిటని ఈ సందర్భంగా ప్రశ్నించిన ఆయన, తన బిడ్డను వదిలేయాలని కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

యూజీ నీట్ ప్రవేశ పరీక్షా విధానంలో కీలక మార్పు?

మహా పీఠముడి... మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు?

డోనాల్డ్ ట్రంప్‌కు భారీ ఊరట.. ఏంటది..?

అరెస్టుకు సిద్ధంగా పోలీసులు.. పారిపోయిన రాంగోపాల్ వర్మ!!

బంగాళాఖాతంలో అల్పపీడనం : ఏపీతో సహా ఆ రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments