Webdunia - Bharat's app for daily news and videos

Install App

అజాత శ్ర‌తువు కృష్ణంరాజు కేంద్ర‌మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప‌రామ‌ర్శ‌

Webdunia
శనివారం, 17 సెప్టెంబరు 2022 (09:33 IST)
Rajnath Singh, Shyama Devi, Prabhas
ఇటీవల అనారోగ్య కారణాలతో  మరణించిన కృష్ణంరాజు కుటుంబాన్ని శుక్ర‌వారం రాత్రి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ క‌లిసి ప‌రామ‌ర్శించారు. ఇదేరోజు భార‌తీయ జ‌న‌తాపార్టీకి సంబంధించిన తెలంగాణ విమోచ‌న దినోత్స‌వంలో భాగంగా ఆయ‌న హైద‌రాబాద్ వ‌చ్చి ప‌లు కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నారు. అనంత‌రం జూబ్లీహిల్స్‌లోని జె.ఆర్‌.సి. ఫంక్ష‌న్ హాల్‌లో బిజెపి ఏర్పాటు చేసిన సంప‌తా స‌భ‌కు ఆయ‌న హాజ‌ర‌యి కృష్ణంరాజుతో త‌న‌కు గ‌ల అనుబంధాన్ని నెమ‌రేసుకున్నారు. ఢిల్లీలో ఎప్పుడు క‌లిసినా అన్న‌య్యా! అంటూ ఆప్యాయంగా ప‌లుక‌రించేవారని తెలిపారు. 
 
ఢిల్లీనుంచి రాగానే ముందుగా కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కృష్ణంరాజు కుటుంబ సభ్యులను పరామర్శించారు. కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవితో పాటు పిల్లలు, సినీ నటుడు ప్రభాస్‌ను  కుటుంబానికి త‌న ప్రగాఢ సానుభూతిని తెలియజేశాను. కృష్ణంరాజు అజాశ‌త్రువు. సర్వశక్తిమంతుడు వారికి ఈ స్మారక నష్టాన్ని భరించే శక్తిని ప్రసాదించుగాక అంటూ దేవుడ్ని వేడుకుంటూ రాజ్‌నాథ్ ట్వీట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Hyderabad Realtor: అప్పులు చేసి అపార్ట్‌మెంట్ నిర్మాణం, ఫ్లాట్స్ అమ్ముడవక ఆత్మహత్య

గుజరాత్- మహిళ బట్టలు విప్పి, దాడి చేసి, మోటార్ సైకిల్ చక్రానికి కట్టి ఈడ్చుకెళ్లారు..

ఫిబ్రవరి 2న జనంలోకి జనసేన.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ప్రచారం

రాత్రికి రాత్రే అంతా మారిపోదు.. 16,347 ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్.. చంద్రబాబు

హైదరాబాద్‌లో రక్తదాన శిబిరాలను నిర్వహించిన కిస్నా డైమండ్ జ్యువెలరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆటలో అరటి పండు కాదు ఆరోగ్యానికి అరటి పండు

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

తర్వాతి కథనం
Show comments