Webdunia - Bharat's app for daily news and videos

Install App

మళ్లీ గర్భందాల్చిన ఐశ్వర్యా రాయ్?

Webdunia
ఆదివారం, 14 నవంబరు 2021 (13:21 IST)
బాలీవుడ్ అందాలతార, మిస్ వరల్డ్ ఐశ్వర్యారాయ్ బచ్చన్ మళ్లీ గర్భందాల్చినట్టు వార్తలు గుప్పుమన్నాయి. ఇప్పటికే ఓ బిడ్డ తల్లిగా ఉన్న ఐశ్వర్యా... ఇటీవల త‌న కూతురు, భ‌ర్త‌తో క‌లిసి ఎక్క‌డికో వెళుతున్న క్ర‌మంలో ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ప్ర‌త్య‌క్షమైంది. 
 
చేతిలో ఉన్న హ్యండ్‌బ్యాగ్‌ని ఐశ్వర్య పొత్తి కడుపుకి అడ్డుగా పెట్టుకుని వెళుతుండగా కెమెరా కంటికి చిక్కారు. అంతేకాకుండా కూతురు ఆరాధ్యను సైతం దగ్గరికి తీసుకుంది. దీంతో ఐష్ గ‌ర్భ‌వ‌తి కావడం వల్లే అలా జాగ్రత్తలు తీసుకున్నారంటూ ప్ర‌చారం సాగుతోంది. 
 
అయితే, దీనిపై బచ్చన్ ఫ్యామిలీ మాత్రం పెదవి విప్పడం లేదు. 2007 ఏప్రిల్‌ 20న ఐశ్వర్య రాయ్‌, అభిషేక్‌ బచ్చన్‌లకు వివాహం కాగా, 2011 నవంబర్‌ 16న వీరికి ఆరాధ్య జన్మించింది.
 
ఇదిలావుంటే, 1994లో మిస్ వ‌ర‌ల్డ్ కిరీటాన్ని అందుకున్న ఐశ్వ‌ర్య‌రాయ్.. 1997లో మణిరత్నం తెరకెక్కించిన ‘ఇరువర్‌’ (ఇద్దరు) సినిమాతో చిత్రసీమలోకి అడుగుపెట్టింది. తొలి చిత్రంలోనే ద్విపాత్రాభినయం చేసింది. రాజకీయ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా మంచి విజయం సాధించింది.
 
తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల‌లో వైవిధ్య‌మైన చిత్రాలు చేస్తూ ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్న ఐష్ ప్ర‌స్తుతం మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న హిస్టారికల్‌ ఫిక్షన్‌ స్టోరీ ‘పొన్నియన్‌ సెల్వన్‌’లో నటిస్తున్నారు. రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో ఐష్ స‌ర్‌ప్రైజింగ్ లుక్‌లో క‌నిపించ‌నుంద‌ని అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

24న డాక్టర్ గౌరీ లక్ష్మీబాయికి ఆధ్యాత్మిక పురస్కారం ప్రదానం

జగన్ 'గులక రాయి' డ్రామా.. వైకాపా గాలి తీసిన సీఎం చంద్రబాబు

పండమేరు వంతెన నిర్మాణానికి నిధులు ఇవ్వండి.. పవన్‌కు పరిటాల సునీత వినతి

కేన్సర్ 40 రోజుల్లో తగ్గిపోయిందన్న నవజ్యోత్ సింగ్ సిద్ధు, నెటిజన్లు ఏమంటున్నారు?

పెద్దిరెడ్డి పక్కకుపోతే.. పవన్‌తో చేతులు కలిపిన బొత్స -వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments