Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళ మార్కెట్‌పై కన్నేసిన అల్లు అర్జున్ .. ఆ చిత్రం రీమేక్‌తో ఎంట్రీ

మెగా ఫ్యామిలీకి చెందిన హీరో అల్లు అర్జున్. ఆయన నటిస్తున్న తాజా చిత్రం "నా పేరు సూర్యం.. నా ఇల్లు ఇండియా". ఈ చిత్రాన్ని తమిళంలోకి అనువదిస్తున్నారు. 'ఎన్‌ పేరు సూర్య ఎన్‌ వీడు ఇండియా' అనే పేరుతో అనువదిం

Webdunia
మంగళవారం, 20 మార్చి 2018 (13:10 IST)
మెగా ఫ్యామిలీకి చెందిన హీరో అల్లు అర్జున్. ఆయన నటిస్తున్న తాజా చిత్రం "నా పేరు సూర్యం.. నా ఇల్లు ఇండియా". ఈ చిత్రాన్ని తమిళంలోకి అనువదిస్తున్నారు. 'ఎన్‌ పేరు సూర్య ఎన్‌ వీడు ఇండియా' అనే పేరుతో అనువదించి, తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల చేయనున్నారు. సైనిక నేపథ్యంతో వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై తెలుగు రాష్ట్రాల్లో భారీ అంచనాలే ఉన్నాయి.
 
ఇదిలావుంటే, టాలీవుడ్ హీరోలకు కోలీవుడ్‌లో హిట్ అనేది అందని ద్రాక్షగానే మారింది. కానీ, తమిళ హీరోల పరిస్థితి అలా కాదు. రజనీకాంత్, కమల్ హాసన్, మురళి, టి రాజేందర్, సూర్య, కార్తీ ఇలా అనేక హీరోలు వరుసబెట్టి హిట్లు కొట్టేస్తున్నారు. దీంతో కోలీవుడ్‌పై కన్నేసిన తెలుగు హీరోలు.. ఓ హిట్ కొట్టాలన్న గట్టిపట్టుదలతో ఉన్నారు. నిజానికి గత దశాబ్దకాలంలో మహేష్‌బాబు, ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌, రవితేజ ఇలా టాలీవుడ్‌ అగ్ర నటులందరూ అనువాదాలతో తమిళ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కానీ, సరైన హిట్‌ను అందుకోలేక పోయారు. 
 
అంతెందుకు తెలుగులో బ్లాక్‌బ్లస్టర్లుగా నిలిచిన 'మగధీర', 'శ్రీమంతుడు' చిత్రాలు సైతం తమిళంలో అంతంతమాత్రంగానే ఆడాయి. కొన్ని నెలల క్రితం మహేష్‌బాబు తమిళ ఎంట్రీ సినిమా 'స్పైడర్' దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది. 'మావీరన్'గా తమిళంలోకి అనువదించిన ‘మగధీర’ సైతం మెప్పించలేకపోయింది. 
 
ఈ నేపథ్యంలో అల్లు అర్జున్‌ చాలాకాలంగా తమిళంలో ఆరంగేట్రం చేయాలని ప్రయత్నిస్తున్నాడు. తమిళంలో డైరెక్టుగానే నటిస్తాను తప్ప, అనువాదంతో కోలీవుడ్‌కి రానని భీష్మించుకుని కూర్చున్నాడు. గతేడాది లింగుస్వామి దర్శకత్వంలో ఒక చిత్రాన్ని అట్టహాసంగా ప్రారంభించారు కూడా. అయితే ప్రస్తుతం ఆ సినిమా అటకెక్కేసింది. దీంతో ప్రస్తుతం సెట్స్‌పై ఉన్న తన డ్రీమ్‌ ప్రాజెక్టు ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ను అనువాదం చేసి కోలీవుడ్ వెండితెరపై సందడి చేయాలని భావిస్తున్నాడు. మరి ఆయన డ్రీమ్ ఏ మేరకు ఫలిస్తుందో వేచిచూడాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెళ్లాడుతానని తరచూ నాపై అత్యాచారం చేసాడు: కన్నడ నటుడు మనుపై సహ నటి ఫిర్యాదు

మీ పోస్టుల్లో ఎలాంటి భాష వాడారో మాకు అర్థం కాదనుకుంటున్నారా? సజ్జలపై సుప్రీం ఫైర్

Peddireddy Ramachandra Reddy: మాజీ మంత్రి పెద్దిరెడ్డికి హైకోర్టులో చుక్కెదురు

పాక్ ఆర్మీ చీఫ్‌కు ఫీల్డ్ మార్షల్ హోదా కాదు.. రాజు బిరుదు ఇవ్వాల్సింది : ఇమ్రాన్ ఖాన్

Heavy rain alert: అల్పపీడనం శక్తి తుఫాన్‌గా మారింది.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం
Show comments