Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేష్ బాబుతో సినిమానా? చేసేది లేదన్న రష్మిక, సాయిపల్లవి?

Webdunia
మంగళవారం, 19 మార్చి 2019 (10:36 IST)
టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు మహర్షి సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మహేష్‌కి 25వ సినిమా. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా, మే 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మహేష్ 26వ సినిమాపై దృష్టి పెట్టాడు. అనిల్ రావిపూడితో చేసే తన 26వ సినిమా కోసం త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్నాడు. ఇదే విషయాన్ని గురించి తాజాగా అనిల్ రావిపూడి ట్వీట్ చేశాడు.
 
తాను దర్శకత్వం వహించే 5వ సినిమాకి సంబంధించిన కథకి తుది మెరుగులు దిద్దుతున్నాననీ, త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలుకాబోతోందని అనిల్ రావిపూడి ట్వీట్ చేశాడు. మహేశ్ బాబు 26వ సినిమాకి సంబంధించిన రంగం సిద్ధమైందంటూ ఆయన ఇలా హింట్ ఇచ్చాడు.
 
ఈ సినిమా ఏప్రిల్‌లో ప్రారంభం అవుతుందని.. మహర్షి విడుదలకు తర్వాత రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం. ఇందులో మహేష్ సరసన రష్మిక మందన నటించే అవకాశం వున్నట్లు తెలుస్తోంది. అయితే డేట్స్ లేకపోవడంతో మహేశ్ సరసన నటించే అవకాశాన్ని రష్మిక కోల్పోయిందని.. అలాగే ప్రేమమ్ హీరోయిన్ సాయిపల్లవి కూడా మహేష్ 26 సినిమాలో నటించే అవకాశం వచ్చినా చేజార్చుకున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఉప్పల్ స్టేడియంలో బ్యాడ్మింటన్ ఆడుతుండగా గుండెపోటు.. 25ఏళ్ల వ్యక్తి మృతి.. ఆయన ఎవరు? (Video)

పహల్గాం ఉగ్రదాడికి పాల్పడింది మన దేశ ఉగ్రవాదులా? చిదంబరం వివాదాస్పద వ్యాఖ్యలు

హైదరాబాదులో రేవ్ పార్టీని చేధించిన EAGLE.. తొమ్మిది మంది అరెస్ట్

Jagan: సెంట్రల్ జైలుకు వెళ్లనున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఎందుకు?

నేడు ఆపరేషన్ సింధూర్‌పై వాడివేడిగా చర్చ..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments