అమెరికా వెళ్లిపోతున్నా.. మీటూ ఆరోపణలు ఏమౌతాయ్

Webdunia
సోమవారం, 17 డిశెంబరు 2018 (15:42 IST)
మీటూ ఆరోపణలతో దేశంలో సంచలనం సృష్టించిన తను శ్రీ దత్తా అమెరికా వెళ్లిపోతుందట. తన భవిష్యత్తు అక్కడే వుందని.. నెల రోజులు వుందామనే ముంబైకి వచ్చానని తెలిపింది. కానీ ప్రస్తుతం ఐదు నెలలు దాటేసిందని చెప్పుకొచ్చింది. దీంతో మీటూ ఆరోపణలకు సంబంధించి తను శ్రీ దత్తా ఇచ్చిన ఫిర్యాదులు, కేసులు ఏమౌతాయోనని సినీ పండితులు అడుగుతున్నారు.
 
తొలుత మీటూ ఉద్యమంలో ఎవరి పేర్లను బయటపెట్టని తను శ్రీ తనను వేధించిన వారి పేర్లను మీడియా ముందు చెప్పేసింది. నటుడు నానా పటేకర్, దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి వంటి సెలబ్రిటీలు తనను లైంగికంగా వేధించారని చెప్పింది. దీంతో బాలీవుడ్‌లో పెద్ద దుమారమే చెలరేగిన సంగతి తెలిసిందే. 
 
తనుశ్రీని స్పూర్తిగా తీసుకున్న కొందరు నటీమణులు తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపులను కూడా బయటపెట్టడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో చాలామంది దర్శకులు, నిర్మాతలు, హీరోల మీద ఆరోపణలు వచ్చాయి. మీటూ ఉద్యమం బాలీవుడ్‌లో భారీ ఎత్తున ఉద్యమించడానికి కారణమైన తనుశ్రీ ఇప్పుడు అన్నీ వదిలేసి తిరిగి అమెరికా వెళ్లిపోతున్నట్లు ప్రకటించడం చర్చనీయాంశమైంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కర్నాటక కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఇకపై కొనసాగలేను : డీకే శివకుమార్

పుట్టపర్తిలో ప్రధాని మోడి పాదాలకు నమస్కరించిన ఐశ్వర్యా రాయ్ (video)

తమిళనాడులో డిజిటల్, స్టెమ్ విద్యను బలోపేతం చేయడానికి సామ్‌సంగ్ డిజిఅరివు కార్యక్రమం

తెలంగాణలో ఒకటి, భారత్‌వ్యాప్తంగా 10 అంబులెన్స్‌లను విరాళంగా అందించిన బంధన్ బ్యాంక్

శీతాకాలంలో సైబరాబాద్ సరిహద్దుల్లో జాగ్రత్త.. వాహనదారులకు మార్గదర్శకాలు జారీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం