Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్యాన్స్‌తో రజనీకాంత్ భేటీ.. నగ్మా పిలుపు.. రాజకీయాల్లో రజనీ కాంత్?

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ మరోసారి తన అభిమానులకు పిలుపునిచ్చారు. గతంలో రెండుసార్లు అభిమానులతో సమావేశం కావాలనుకున్న రజనీకాంత్.. అనివార్య కారణాల వల్ల వాయిదా వేసుకున్నారు. అయితే తాజాగా తన అభిమానులకు మాట

Webdunia
గురువారం, 11 మే 2017 (13:35 IST)
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ మరోసారి తన అభిమానులకు పిలుపునిచ్చారు. గతంలో రెండుసార్లు అభిమానులతో సమావేశం కావాలనుకున్న రజనీకాంత్.. అనివార్య కారణాల వల్ల వాయిదా వేసుకున్నారు. అయితే తాజాగా తన అభిమానులకు మాట్లాడుకుందాం రమ్మని రజనీకాంత్ కబురు పంపారు. అభిమానులతో రజనీకాంత్ ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో తమిళ రాజకీయాలపై చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 
 
తమిళనాడులో బీజేపీ, కాంగ్రెస్ పార్టీ లకు చెందిన నేతలు రజనీకాంత్‌ను టార్గెట్ చేసిన నేపథ్యంలో ఈనెల 15వ తేదీ నుంచి 19వ తేదీ వరకు చెన్నైలోని కోడంబాకంలోని రాఘవేంద్ర కళ్యాణ మండపాన్ని బుక్ చేశారు. అందులో ఆయన అభిమానులను కలుసుకోనున్నారు. ఈ సందర్భంగా రజనీకాంత్ రాజకీయ తెరంగేట్రంపై ఫ్యాన్స్ ఒత్తిడి తెచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలని పోస్టర్లు వెలిశాయి. రజనీకాంత్ అభిమానులతో ఫోటోలు దిగేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. 
 
ఇందులో భాగంగా ఈ నెల 15వ తేదీ నుంచి 19వ తేదీ వరకు అభిమానులను కలవనున్నారు. ప్రతి రోజూ మూడు జిల్లాలకు చెందిన అభిమానులను కలవనున్నారు. అలా ఐదు రోజులపాటు 15 జిల్లాలకు చెందిన తన అభిమానులను రజనీకాంత్ కలుసుకుంటారు. 
 
ఈ సందర్భంగా వారితో ముచ్చటించిన అనంతరం ఫోటోలు దిగి, విందు ఇవ్వనున్నారు. ఈ మేరకు రజనీకాంత్‌ అభిమాన సంఘం అధ్యక్షుడు కేఎస్ రాజా ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సమావేశాల అనంతరం ఆయన రాజకీయ రంగ ప్రవేశంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. రజనీకాంత్ రాజకీయాల్లో రావాలని చాలామంది ఆశిస్తున్నారు. 
 
ఇటీవలే భాషా సినిమాలో రజనీతో జతకట్టిన నగ్మా కూడా రాజకీయాల్లోకి రజనీ రావాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ నేత హోదాలో నగ్మాను రజనీ కలిసింది. మరి ఈ ఫ్యాన్స్ మీట్ సందర్భంగా రజనీకాంత్ రాజకీయ ప్రవేశంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

30 రోజులకు మించి ఉంటున్నారా? అయితే తట్టాబుట్టా సర్దుకుని వెళ్లిపోండి.. అమెరికా

మీరట్ హత్య కేసు : నిందితురాలికి ప్రత్యేక సదుపాయాలు!

ఒకే ఇంట్లో ఇద్దరు క్రికెటర్లు ఉండగా... ఇద్దరు మంత్రులు ఉంటే తప్పేంటి: కె.రాజగోపాల్ రెడ్డి (Video)

అనకాపల్లిలో భారీ అగ్నిప్రమాదం.. ఎనిమిది మంది మృతి

ఏడుకొండలను 5 కొండలుగా మార్చేందుకు కుట్ర : హోం మంత్రి అనిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments