నిన్న ఎయిర్‌ఏషియా.. నేడు పీవీఆర్... ఎయిర్‌టెల్.. ఇదీ 'కబాలి' మానియా
ప్రస్తుతం ఎక్కడ చూసినా 'కబాలి' మానియానే కనిపిస్తుంది. పా.రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రాధిక ఆప్టే హీరోయిన్‌గా నటించింది. కలైపులి ఎస్. థాను నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఈ నెల
ప్రస్తుతం ఎక్కడ చూసినా 'కబాలి' మానియానే కనిపిస్తుంది. పా.రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రాధిక ఆప్టే హీరోయిన్‌గా నటించింది. కలైపులి ఎస్. థాను నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 22న రిలీజ్ కాబోతుంది. 'లింగా', 'కొచ్చైడాయాన్' పరాజయం తర్వాత రజినీ నటిస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఈ సినిమాకున్న క్రేజ్‌ని పలు కంపెనీలు తమ బ్రాండ్‌లకు వాడుకుని ప్రమోట్ చేసుకుంటున్నాయి. తమ బ్రాండ్ల ప్రమోట్ కోసం కస్టమర్లను రకరకాల ఆఫర్లతో ఆకర్షిస్తున్నాయి.
ఈ సినిమాకు అధికారిక బ్రాండ్ భాగస్వామిగా ఉన్న ఏయిర్ ఏషియా కబాలి స్పెషల్ విమానాలను సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రేజ్‌ను క్యాష్ చేసుకోవడానికి ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ కూడా రంగంలోకి దిగింది. ఎయిర్‌టెల్ 'కబాలి' ప్రమోషన్ కోసం స్పెషల్‌గా కబాలి సిమ్‌లు రెడీ చేసి మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ స్పెషల్ సిమ్ తీసుకున్న వారికి 'కబాలి' వాల్ పేపర్స్, కబాలి రింగ్‌టోన్స్ ఫ్రీ అని ప్రకటిస్తోంది. ఇక ఇప్పటికే ఎయిర్‌టెల్ సిమ్ వాడుతున్న కస్టమర్స్ కోసం కబాలి స్పెషల్ రీచార్జ్ కూపన్లను కూడా ప్రవేశపెడుతోంది. అంతేకాదు ప్రత్యేక ఎస్ఎంఎస్ ఛానల్ ద్వారా ఎయిర్‌టెల్ వినియోగదారులు సూపర్‌స్టార్‌ను విష్‌చేసే అవకాశాన్ని కూడా కల్పిస్తోంది.
తమ వినియోగదారుల నుంచి వచ్చిన సందేశాలను ఒక చిన్న పుస్తకం రూపంలో తయారు చేసి సూపర్‌స్టార్ రజనీకి అందజేయనున్నట్లు భారత ఎయిర్‌టెల్ ప్రతినిధి జార్జ్ మతెన్ వెల్లడించారు. తమిళనాడు మొత్తం తిరిగేలా ఎయిర్‌టెల్ 3డీ హాలోగ్రాఫిక్ ఎయిర్‌టెల్ కబాలి వ్యాన్‌ను సైతం తీసుకురాబోతుంది. సినిమా విడుదలకు వారం రోజుల ముందు ప్రారంభమయ్యే ఈ వాహనం యాత్ర నెలరోజుల పాటు సాగనుంది. దీనిని బట్టి సూపర్‌స్టార్‌కు సౌత్‌లో ఎంత క్రేజ్ ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.