Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో అదిరే అభి - వైట్ పేపర్ సినిమా

Webdunia
శుక్రవారం, 24 సెప్టెంబరు 2021 (20:07 IST)
Abi, anasuya, mano, indraja etc
జి.ఎస్.కె  ప్రొడక్షన్స్ పతాకంపై శివ దర్శకత్వం గ్రందే శివ ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం `వైట్ పేపర్` (White Paper). ఈశ్వర్ చిత్రంలో ప్రభాస్ ఫ్రెండ్ గా తన నట జీవితాన్ని ప్రారంభించిన అభినయ కృష్ణ, ఎన్నో చిత్రాల్లో నటుడుగా కమెడియన్ గా మంచి పేరు సంపాదించుకున్నాడు. జబర్దస్త్ టివి షో తో అదిరిపోయే కామెడీ పెర్ఫార్మెన్స్ తో అదిరే అభిగా ప్రసిద్ధి చెందాడు. ఇప్పుడు ఈ వైట్ పేపర్ చిత్రంతో హీరోగా పరిచయం కాబోతున్నాడు.
 
ఈ చిత్రాన్ని కేవలం 9 గంటల 51 నిమిషాల వ్యవధిలో పూర్తి చేసారు. ఈ సందర్భంగా  ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు అరుదైన చిత్రంగా సత్కరించారు.
 
ఈ రోజు సెప్టెంబర్ 24న మన అదిరే అభి పుట్టిన రోజు. ఈ సందర్భంగా వైట్ పేపర్ టైటిల్ లుక్ ను మనో,ఇంద్రజా, అనసూయ గార్లు విడుదల చేసారు.
 
ఈ సందర్భంగా మనో మాట్లాడుతూ "వైవిధ్య కథనాలు ఎంచుకోవడంలో మా అభి ముందు ఉంటాడు, అలానే ఇప్పుడు ఈ వైట్ పేపర్ సినిమా ని కూడా డిఫరెంట్ గా చేసాడు, ఈ చిత్రం మంచి విజయం సాధించాలి" అని కోరుకున్నారు.
 
ఇంద్రజా మాట్లాడుతూ,  "సామాన్యంగా నటి నటులు తమ పాత్రలు చేస్తున్నప్పుడు ఎంతో హోమ్ వర్క్ చేస్తారు , అలాంటిది ఒక్క రోజులో అది కూడా  9 గంటల 51 నిమిషాల టైమ్ టార్గెట్ పెట్టుకొని సినిమా తియ్యడం అంటే ఇంకా మా అభి  చాలా హోమ్ వర్క్స్ చేసి ఉంటాడు, సో అభి ఇలాంటి అవార్డ్స్ ఇంకా ఎన్నో పొందాలని కోరుకుంటున్నాను.
 
అనసూయ మాట్లాడుతూ "అభిని ఎప్పటి నుంచో చూస్తున్నాను , అభి ఏదేనా చేయాలి అనుకుంటే చాలా కొత్తదనం ఉండేలా చూసుకుంటాడు , ఒక నటుడిగా తన ప్రతిభ మన అందరికి తెలుసు, ఇప్పుడు వైట్ పేపర్ సినిమాలో హీరో గా చేయడమే కాకుండా, ఆ సినిమా ని ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నిలిచేలా చేయడం చాలా సంతోషంగా ఉంది, వారి టీం అందరికి శుభాకాంక్షలు.
 
హీరో అభి మాట్లాడుతూ "కథ చాలా ఇంటరెస్టింగ్ గా అనిపించింది. కేవలం 9 గంటల 51 నిమిషాల సమయంలోనే సినిమా షూటింగ్ అంత పూర్తి చేయాలి అన్నప్పుడు దర్శకుడి డెడికేషన్ నచ్చింది. ఈ చిత్రానికి విడుదల ముందే ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డు రావటం, మా మనో గారు, ఇంద్రజా గారు, అనసూయ గారు మా చిత్రం టైటిల్ లుక్ పోస్టర్ ను విడుదల చేయటం చాలా సంతోషం గా ఉంది .
 
డైరెక్టర్ శివ మాట్లాడుతూ "సస్పెన్స్ కథనంతో తెరకెక్కిన ఈ సినిమా లో అభి హీరోగా నటించారు. తను లేకపోతే ఈ సినిమా ఉండేది కాదు, మాకు అవార్డు కూడా వచ్చేది కాదేమో, మాకు అభి అన్న ఇచ్చిన  సపోర్ట్ వాళ్ళ 9 గంటల 51 నిమిషాలలో  చిత్రాన్ని పూర్తిచేసాము. అందరూ ఒక్క రోజులో ఎలా సినిమా తీయగలవు అన్నారు, అభి అన్న సపోర్ట్ తో, టీం సహకారంతో సినిమా తీయడం అవార్డు కొట్టడం, అలానే అభి అన్న పుట్టినరోజు సందర్భంగా ఇలా టైటిల్ లుక్  రివిల్ చేయడం చాలా సంతోషంగా ఉంది అన్నారు. ఈ కార్యక్రమంలో రాజశేఖర్, శ్యామ్ ప్రసాద్ లు పాల్గొన్నారు.
 
అదిరే అభి ( అభినయ కృష్ణ), వాణి, తల్లాడ సాయి కృష్ణ ,నేహా, నంద కిషోర్ తదితరులు నటించిన ఈ సినిమా కి నిర్మాత - గ్రంథి శివ కుమార్, డైరెక్టర్- శివ,కేమేరా- మురళి కృష్ణ, ఎడిటింగ్- కె.సి.బి. హరి, సంగీతం - నవనిత్ చారి,

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అదానీ ఇచ్చిన రూ. 100 కోట్లు విరాళం నిరాకరిస్తున్నాం: సీఎం రేవంత్ రెడ్డి

ఆక్సిజన్ కొరత.. కవలపిల్లలు అంబులెన్స్‌లోనే చనిపోయారా?

అల్పపీడనం: నవంబర్ 26 నుంచి 29 వరకు ఏపీలో భారీ వర్షాలు (video)

జ్వరంతో విద్యార్థిని మృతి.. టీచర్లపై కేసు నమోదు.. ఎందుకని?

జైలుకు వెళ్లినలారంతా సీఎం అయ్యారనీ.. ఆ లెక్కన కేటీఆర్‌కు ఆ ఛాన్స్ రాదు : సీఎం రేవంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments