Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఆదిపురుష్' క్రేజ్ : ఆంజనేయుడి పక్క సీటు ధర భారీ రేటు!

Webdunia
సోమవారం, 12 జూన్ 2023 (14:58 IST)
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా "ఆదిపురుష్" క్రేజ్ మొదలైంది. ఈ నెల 16వ తేదీన భారీ స్థాయిలో ఐదు భాషల్లో పాన్ ఇండియా మూవీగా విడుదలకానుంది. ప్రభాస్, కృతి సనన్ జంటగా నటించిన ఈ చిత్రం బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ డైరెక్ట్ చేశారు. ఈ సినిమా ఆడియో ట్రైలర్ ఇటీవలే విడుదల చేశారు. ఈ సినిమా విడుదల కోసం ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నారు. కొందరు సినీ ప్రముఖులు భారీ ఎత్తున టికెట్స్ కొనుగోలు చేసి సినిమాపై వారికున్న అభిమానాన్ని చాటుకున్నారు. అలాగే కొన్ని ప్రాంతాల్లో ప్రతి రామాలయానికి ఉచితంగా 101 టిక్కెట్స్‌ను ఇవ్వనున్నట్లు కొన్ని మీడియా సంస్థలు ప్రకటించాయి. 
 
ఇకపోతే, ఈ సినిమా ప్రదర్శించే ప్రతి థియేటర్లో ఒక సీటుని ఆంజనేయుడి కోసం ఖాళీగా ఉంచాలని చిత్రబృందం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ ఖాళీ సీటు పక్కన ఉండే సీటు టికెట్కు సంబంధించి రూమర్స్ మొదలయ్యాయి. రామాయణ పారాయణం జరిగే ప్రతిచోటికీ హనుమంతుడు వస్తాడు అనే నమ్మకంతో.. ప్రతి థియేటర్లో ఒక సీటును ఖాళీగా ఉంచుతున్నారు. 
 
దీంతో కొందరు ఆ సీటు పక్క టికెట్‌ను భారీ ధరకు అమ్ముతున్నారట. ఈ విషయంపై 'ఆదిపురుష్' నిర్మాణ సంస్థ క్లారిటీ ఇచ్చింది. తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దని విజ్ఞప్తి చేస్తూ ట్వీట్ చేసింది. "ఆదిపురుష్' టికెట్స్ విషయంలో రకరకాల వార్తలు వస్తున్నాయి. హనుమంతుడి పక్క సీటు టికెట్ను భారీ ధరకు అమ్ముతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. అన్నీ సీట్ల ధరకే ఆ టికెట్ ధర కూడా అమ్ముతున్నారు. దానికి ఎలాంటి ప్రత్యేకత లేదు. ఇలాంటి పుకార్లు సృష్టించొద్దు" అని ట్వీట్ చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆత్మహత్య చేసుకున్న రోబో.. నిజమా? ఎక్కడ?

జగన్ ఓటమికి ఆ ఇద్దరే కారణం.. ముంచేశారు.. షర్మిల ఆర్కేతో భేటీ: కేతిరెడ్డి

కొత్త సీఎంల మధ్య ఇదే తొలి అధికారిక సమావేశం.. చంద్రబాబు లేఖ

మందు బాబులతో కలిసి చిందులేసిన ఒంగోలు ఏఎస్ఐ.. Video వైరల్

దేవుడి ముందు లొంగిపోయాడు.. అందుకే మరణ శిక్ష రద్దు : ఒరిస్సా హైకోర్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

దానిమ్మ కాయలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments