Webdunia - Bharat's app for daily news and videos

Install App

కామెడీ, యాక్షన్, ఎమోషన్ తో పాటు వయసుకి తగ్గ ఫైట్లు ఉన్న చిత్రం ఆదికేశవ : వైష్ణవ్ తేజ్

Webdunia
గురువారం, 23 నవంబరు 2023 (07:12 IST)
Nagavamsi, vaishnav tej, Srikanth N Reddy
మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్,శ్రీలీల జంటగా నటించిన ఆదికేశవ' మూవీ రిలీజ్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్ర బృందం 'ఆదికేశవ' విశేషాలను పంచుకోవడంతో పాటు, సినిమా విజయం పట్ల నమ్మకం వ్యక్తం చేసింది. అనంతరం విలేఖర్లు అడిగిన ప్రశ్నలకు కథానాయకుడు పంజా వైష్ణవ్ తేజ్, నిర్మాత సూర్యదేవర నాగవంశీ, దర్శకుడు శ్రీకాంత్ ఎన్ రెడ్డి సమాధానమిచ్చారు. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ తో శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు.
 
వైష్ణవ్ తేజ్ మాట్లాడుతూ, "ఇది పూర్తిస్థాయి మాస్ సినిమా అయినప్పటికీ కథలో కొత్తదనం ఉంటుంది. కథ విన్నప్పుడే ఇలాంటి పాయింట్ ఎవరూ టచ్ చేయలేదు అనిపించింది. ఇందులో కామెడీ, సాంగ్స్, విజువల్స్, ఫైట్స్ అన్నీ బాగుంటాయి. ప్రేక్షకులు ఓ మంచి సినిమా చూశామనే ఆనందంతో థియేటర్ల నుంచి బయటకు వస్తారు. పతాక సన్నివేశాలు బాగుంటాయి. క్లైమాక్స్ ఫైట్ చిత్రీకరణ ఛాలెంజింగ్ గా అనిపించింది. టీం అందరం కష్టపడి పనిచేశాం. యాక్షన్ సన్నివేశాలు కథలో భాగంగానే ఉంటాయి. వాటిని సాధ్యమైనంత మేర సహజంగానే చిత్రీకరించాం. ఫైట్స్ ఎక్కడా ఓవర్ ది బోర్డ్ ఉండవు. కొడితే పదిమంది ఎరిగిపోయే తరహా ఫైట్లు ఉండవు. నా వయసుకి తగ్గట్టుగానే ఫైట్లు ఉంటాయి. సినిమా పట్ల టీం అంతా ఎంతో నమ్మకంగా ఉన్నాం. ప్రేక్షకులకు కూడా సినిమా నచ్చుతుందని భావిస్తున్నాం." అన్నారు.
 
నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ, "ఈ సినిమా విజయం పట్ల చాలా నమ్మకంగా ఉన్నాం. విడుదలకు ముందురోజు సాయంత్రం తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోలు వేయాలని నిర్ణయించుకున్నాం. మొదటి షో తిరుపతిలోని సంధ్య థియేటర్ లో మొదలవుతుంది. ముందు రోజే షోలు వేయాలని నిర్ణయం తీసుకున్నామంటే ఈ సినిమా పట్ల మేము ఎంత నమ్మకంగా ఉన్నామో అర్థం చేసుకోవచ్చు. రోజురోజుకి ఆదికేశవ సినిమా పట్ల ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది. సోషల్ మీడియా రీల్స్ లో కూడా ఈ సినిమాలోని పాటలు మారుమోగిపోతున్నాయి." అన్నారు.
 
దర్శకుడు శ్రీకాంత్ ఎన్ రెడ్డి మాట్లాడుతూ, "కథ విని  ఓ కొత్త దర్శకుడిని నమ్మి ఇంత జీవితం ఇచ్చినట్లు.రుణపడి ఉంటాను. జి.వి. ప్రకాష్ గారు అద్భుతమైన పాటలు, నేపథ్య సంగీతం అందించారు. పాటలు అద్భుతంగా రాసిన కాసర్ల శ్యామ్ గారికి, రామజోగయ్య శాస్త్రి గారికి, అలాగే పాటలు కొరియోగ్రఫీ శేఖర్ మాస్టర్ గారికి ధన్యవాదాలు. రామ్-లక్ష్మణ్ మాస్టర్లు నేను రాసుకున్న యాక్షన్ సన్నివేశాలను మరో స్థాయికి తీసుకెళ్ళారు. ఎడిటర్ నవీన్ నూలి గారు ఇంకా బెటర్ చేద్దాం అంటూ చివరి వరకు పనిచేస్తూనే ఉన్నారు. డీఓపీ డడ్లీ గారికి, ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్ గారికి, డీఐ దగ్గరుండి చూసుకున్న ప్రసాద్ గారికి థాంక్స్. నాకు కమర్షియల్ దర్శకుడిగా పేరు తెచ్చుకోవాలని ఉంది. ఇది కామెడీ, ఎమోషన్, యాక్షన్ అన్నీ సరిగ్గా కుదిరిన కమర్షియల్ సినిమా." అని అన్నారు.
 
నటులు జయప్రకాశ్, సుదర్శన్, రచ్చ రవి, గీత రచయితలు రామజోగయ్య శాస్త్రి, కాసర్ల శ్యామ్ తదితరులు ఈ ప్రెస్ మీట్ లో పాల్గొని ఈ చిత్రం ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

శబరిమల ఆలయ ప్రవేశం... రోజుకు 80వేల మంది మాత్రమే..

పురచ్చి తలైవర్ ఎంజీఆర్ అంటే నాకు ప్రేమ, అభిమానం: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి.. తమిళనాడు నుంచి రాలేదు..

ఎయిర్ షో కోసం ముస్తాబైన చెన్నై.. మెరీనాలో కనువిందు

భర్తతో విడిగా వుంటున్న స్నేహితురాలిపై కన్ను, అందుకు అంగీకరించలేదని హత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తేనె మోతాదుకి మించి సేవిస్తే జరిగే నష్టాలు ఏమిటి?

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

బాదం పప్పులోని పోషక విలువలతో మీ నవరాత్రి ఉత్సవాలను సమున్నతం చేసుకోండి

తర్వాతి కథనం
Show comments