Webdunia - Bharat's app for daily news and videos

Install App

అది సాయికుమార్ హీరోగా చిత్రం ప్రారంభం

Webdunia
మంగళవారం, 13 ఏప్రియల్ 2021 (19:38 IST)
Simratth, Aadi, teegala
ఆది సాయికుమార్, సిమ్రత్ కౌర్ జంట‌గా న‌టిస్తున్న చిత్రం ఉగాదినాడు ప్ర‌సాద్‌లేబ్‌లో ప్రారంభ‌మైంది. ముహూర్త‌పు స‌న్నివేశానికి తెలంగాణ డిప్యూటీ స్పీక‌ర్ తీగ‌ల పద్మారావుగౌడ్ క్లాప్ కొట్టగా, నిర్మాత పిల్లలు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. సంజయ్మెఘా, అరుంధతి గౌరవ దర్శకత్వం వ‌హించారు.
అనంత‌రం  తీగల పద్మారావు గౌడ్ మాట్లాడుతూ, చిత్ర నిర్మాత గుడివాడ యుగంధర్ కు ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా వెనకడకుండా ముందుంటానని అందరి ముందు హామీ ఇస్తున్నానని అన్నారు.
 
చిత్ర దర్శకుడు భాస్కర్ బంటుపల్లి తెలుపుతూ, ఇప్పటివరకూ ఆది సాయికుమార్కెరీర్లో చేయని విభిన్నమైన పాత్రను పోషిస్తున్నాడు.అలాగే నాకు సపోర్ట్ చేసిన సాయికుమార్ గారికి ధన్యవాదాలు. రెగ్యులర్ షూటింగ్ మే నుండి స్టార్ట్ చేసి సినిమాను రెండు షెడ్యూల్స్లో పూర్తి చేస్తాము .ఇది పూర్తి కామెడీ ఎంటర్టైనర్ చిత్రం. అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ సినిమా ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉందనిఅన్నారు 
 
నిర్మాత యుగంధర్ వివరిస్తూ, కర్ణాటక డిస్ట్రుబ్యూటర్ అయిన నేను ప్రొడక్షన్ నంబర్ 1 స్టార్ట్ చేసి ఈ సినిమా తీస్తున్నాను. ఈ సినిమా కథను నమ్ముకొని ఆది గారికి ఈ కథ చెప్పగానే ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు.ఈ రోజు ఉగాది పర్వదినాన ఈ సినిమాను ప్రారంభించాము. ఇకపై నా బ్యానర్ సై చాలా చిత్రాలు వస్తాయి.వచ్చే ప్రతి చిత్రం నుండి సినిమా నుండి వచ్చిన డబ్బులో కొంత భాగంపేద విద్యార్థులకు ఉపయోగిస్తాను. నేను సినిమాలు తీయడానికి కూడా ముఖ్య కారణం కూడా అదేనని అన్నారు.
 
అది సాయికుమార్ మాట్లాడుతూ,  అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఇలాంటి మంచి క్యారెక్టర్ లో నన్ను ఎంచుకొన్నందుకు దర్శక,నిర్మాతలకు ధన్యవాదాలు. ఇది మంచి కంటెంట్ ఉన్న కథ.  పూర్తి ఏంటర్ టైనర్ మూవీ. అందరికీ నచ్చుతుందని అన్నారు.
 
సిమ్రత్ కౌర్ మాట్లాడుతూ, కథ చాలా బాగుంది. ఇలాంటి మంచి కథలో ఎంపిక చేసినందుకు  దర్శక,నిర్మాత లకు ధన్యవాదాలు అని అన్నారు

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments