Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎర్రచందనం నేపథ్యంలో అడవి దొంగ

Webdunia
గురువారం, 18 నవంబరు 2021 (15:57 IST)
Kiran Kotaprolu, Veerashankar, Ara Mastan and others
రామ్‌తేజ్, రేఖ ఇందుకూరి హీరోహీరోయిన్లుగా కిరణ్ కోటప్రోలు దర్శకత్వంలో నిర్మాత గోపీకృష్ణ నిర్మిస్తున్న చిత్రం ‘అడవి దొంగ’. ఎర్రచందనం నేపథ్యంలో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్ర ట్రైలర్‌ని గురువారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో జరిగిన కార్యక్రమంలో చిత్రయూనిట్ విడుదల చేసింది. ప్రముఖ దర్శకుడు వీరశంకర్, నిర్మాత ఆరా మస్తాన్‌లు ట్రైలర్‌ను విడుదల చేసి చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ట్రైలర్ చాలా బాగుందని, ఖచ్చితంగా ఈ చిత్రం పెద్ద విజయం సాధిస్తుందని, టీమ్ అందరికీ మంచి పేరు రావాలని వారు అభిలషించారు.  
 
చిత్ర దర్శకుడు కిరణ్ కోటప్రోలు మాట్లాడుతూ, ఫారెస్ట్‌, ఎర్రచందనం నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుంది. అన్ని కమర్షియల్ హంగులతో, రియాలిటీకి దగ్గరగా చిత్రాన్ని రూపొందించడం జరిగింది. అందరూ ఎంతో కష్టపడి, ఇష్టపడి పనిచేశారు. ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నామని అన్నారు.
 
హీరో రామ్‌తేజ్ మాట్లాడుతూ, యాక్ష‌న్ స‌న్నివేశాల్లో ఒకానొక దశలో నా కాలు విరిగింది. అయినా సరే డైరెక్టర్ పని చేయించాడు. ఆయన పని రాక్షసుడు. ఆయన అలా ఉంటాడు కాబట్టే.. సినిమా చాలా రిచ్‌గా వచ్చిందని తెలిపారు.
 
నిర్మాత గోపీకృష్ణ మాట్లాడుతూ, స‌హ‌జ‌మైన వాతావ‌ర‌ణంలో అట‌వీ ప్రాంతంలో ఈ సినిమా తీశాం.ప్ర‌స్తుతం పోస్ట ప్రొడ‌క్ష‌న్ ప‌నులు చురుగ్గా సాగుతున్నాయి.  త్వరలోనే చిత్ర విడుదల వివరాలను తెలియజేస్తామ‌ని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పురుషులకు వారానికి రెండు మద్యం బాటిళ్లు ఇవ్వాలి : జేడీఎస్ ఎమ్మెల్యే డిమాండ్

బీజాపూర్ - కాంకెర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ - 22 మంది మావోలు హతం

ఎస్వీ యూనివర్శిటీ విద్యార్థికి రూ.2.5 కోట్ల ప్యాకేజీ

నాన్న డ్రమ్ములో ఉన్నాడు... తండ్రి హత్యపై ఆరేళ్ళ పాప నోట నుంచి వచ్చిన నిజం..

రోజూ కాసులిస్తేనే పక్కలోకి రండి - భార్య షరతు.. పోలీసులకు టెక్కీ ఫిర్యాదు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments