Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరోయిన్‌గా చేసే సమయంలో ఇబ్బందులు పడ్డా కానీ హద్దులు దాటలేదు : సుహాసిని

Webdunia
ఆదివారం, 15 అక్టోబరు 2023 (16:22 IST)
తాను హీరోయిన్‌గా చేసే సమయంలో పలు ఇబ్బందులు పడ్డానని కానీ, ఎనాడూ హద్దులు దాటలేదని హీరోయిన్ సుహాసిని అన్నారు. ఆమె తాజాగా మాట్లాడుతూ, అసభ్యకరమైన సన్నివేశాల్లో నటించాల్సి వస్తే తాను తిరస్కరించేదాన్నని చెప్పారు. ఓ సినిమాలో హీరో ఒడిలో కూర్చునే సన్నివేశం ఉందని... అయితే పరాయి వ్యక్తి ఒడిలో కూర్చునే సీన్ కాబట్టి ఆ సీన్ ను తాను చేయనని చెప్పానని తెలిపారు. 
 
అదే సినిమాలో హీరోతో కలిసి ఐస్ క్రీమ్ తినే సీన్ ఉందని... హీరో తిన్న ఐస్ క్రీమ్‌నే తినాలని తనకు చెప్పారని... వేరే వాళ్లు తిన్న ఐస్ క్రీమ్‌ను తాను తినడం ఏమిటని సీరియస్ అయ్యానని చెప్పారు. అయితే తాను చెప్పిన విధంగా చేయాలని కొరియోగ్రాఫర్ తనపై సీరియస్ అయ్యాడని... అయినా తాను అంగీకరించలేదని... ఎంగిలి ఐస్ క్రీమ్ తినడం కాదు, కనీసం ముట్టుకోనని చెప్పానని... దీంతో ఐస్ క్రీమ్ మార్చారని తెలిపారు.
 
కాగా, తమిళం, తెలుగు భాషల్లో సుహాసిని అనగానే మనకు ఒక హోమ్లీ హీరోయిన్‌గా అనే ఫీలింగ్ కలుగుతుంది. హీరోయిన్‌గా ఎన్నో చిత్రాల్లో నటించిన ఆమె.. ఏరోజు కూడా గ్లామర్ షో చేయలేదు. వస్త్రధారణ విషయంలో కూడా ఆమె ఏనాడూ హద్దులు దాటలేదు. అయితే హీరోయిన్‌గా చేసేటప్పుడు తాను చాలా ఇబ్బందులు పడ్డానని ఆమె తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆస్తి కోసం అన్నదమ్ములను చంపేసిన చెల్లి!!

జేపీసీకి జమిలి బిల్లు... కమిటీలో ప్రియాంకా గాంధీ!!

ఆప్ మరో కీలక హామీ : ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఉచిత వైద్యు

భారత్‌కు పన్నుపోటు తప్పదు : హెచ్చరించిన డోనాల్డ్ ట్రంప్

భారతీయులకు అమెరికా శుభవార్త.. ఆ వీసాలో మార్పులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments