Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాల్‌లో మలయాళ నటికి వేధింపులు... వెనుక నుంచి అలా తాకారు..?

Webdunia
శుక్రవారం, 18 డిశెంబరు 2020 (14:13 IST)
మలయాళీ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటి తాజాగా ఓ మాల్‌లో అందరూ చూస్తుండగా వేధింపులను ఎదుర్కొన్నారు. తాను మాల్‌లో షాపింగ్‌ చేస్తుడగా.. ఇద్దరు యువకులు అభ్యంతరకరంగా ప్రవర్తించారని ఆరోపణలు చేస్తూ తాజాగా సదరు నటి ఇన్‌స్టా స్టోరీస్‌లో ఓ సందేశం పెట్టారు. మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న కొంతమంది పురుషులు ఇలాంటి అకృత్యాలకు పాల్పడి మహిళల స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నారన్నారు. 
 
వివరాల్లోకి వెళితే.. నగరంలో పేరుపొందిన.. రద్దీగా వుండే షాపింగ్‌ మాల్‌కు కుటుంబంతో వెళ్లిన నటి వద్ద ఇద్దరు అబ్బాయిలు అభ్యంతరకరంగా ప్రవర్తించారు.  అభ్యంతరకరంగా వెనుక నుంచి తాకారు. ఆ క్షణం ఏమీ అర్థం కాలేదని.. పొరపాటున వాళ్ల చేతులు తనకు తగిలాయని అనుకున్నానని వెల్లడించింది సదరు నటి. కానీ, ఏదో తెలియని భయం, కోపం మాత్రం వచ్చిందని చెప్పుకొచ్చింది. 
 
దీన్ని చూసిన తన సోదరి.. ఆ అబ్బాయిలు కావాలనే ఇబ్బంది పెడుతున్నారని తనతో చెప్పిందని.. దీంతో వాళ్లు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం తన సోదరితో కలిసి అదే మాల్‌లో ఓ షాప్‌లో కొన్ని వస్తువులు కొనేందుకు వెళ్లానని అక్కడే మా అమ్మ, సోదరుడు ఉన్నారు. వస్తువులు కొన్నా అనంతరం బిల్‌ కట్టేందుకు లైన్‌లో వుండగా తిరిగి ఆ ఇద్దరు యువకులు అక్కడికి వచ్చారు. తనతో మాట్లాడడానికి ప్రయత్నించారు. ఇదంతా గమనించిన మా అమ్మ వారిని పట్టుకునేందుకు ప్రయత్నించింది. 
 
దీంతో వాళ్లు పారిపోయారు. కొంతమంది పురుషులు తమ మానసిక ఆరోగ్యం బాగోక ఇలాంటి అకృత్యాలకు పాల్పడుతున్నారు. తనకు జరిగిన విధంగా మరెవరికీ జరగకూడదని కోరుకుంటున్నానని ఆ బాధిత నటి తెలిపింది. ఈ నటి పెట్టిన పోస్ట్‌ని సుమోటోగా తీసుకుని రాష్ట్ర మహిళా కమిషన్‌ ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

CPI Narayana: పవన్ ఎందుకు విడాకులు ఇచ్చాడు.. ఫామ్‌ హౌస్‌లో ఆ పని చేశాడు.. అరెస్ట్ చేయాలి? (video)

One-To-One Meeting: చంద్రబాబు-పవన్ మీట్.. ఏం చర్చించారో తెలుసా?

Ambati: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నారు?: అంబటి ప్రశ్న.. ట్రోల్స్ మొదలు

తెలుగు రాష్ట్రాల్లో వేర్వేరు రోడ్డు ప్రమాదాలు... ఏడుగురు మృతి

Auto Driver: ఆ ఆటో డ్రైవర్‌కు నెలకు రూ.5 నుంచి రూ.8 లక్షల వరకు సంపాదన.. ఎలా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments