Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంతకీ రమ్యకృష్ణ అలా అడ్జెస్ట్ అయినట్లా? కానట్లా?

శివగామి పాత్రతో బాహుబలి చిత్రంలో సూపర్ సక్సెస్ కొట్టిన నటి రమ్యకృష్ణ. ఇన్నాళ్లకు సినీ ఇండస్ట్రీలోని చీకటి కోణాలను బయటపెట్టారు. అడ్జెస్ట్ అవ్వాల్సిందేనంటూ చెప్పుకొచ్చారు. హీరోయిన్‌గా కంటే.. 'పడయప్ప' చి

Webdunia
శుక్రవారం, 12 మే 2017 (18:49 IST)
శివగామి పాత్రతో బాహుబలి చిత్రంలో సూపర్ సక్సెస్ కొట్టిన నటి రమ్యకృష్ణ. ఇన్నాళ్లకు సినీ ఇండస్ట్రీలోని చీకటి కోణాలను బయటపెట్టారు. అడ్జెస్ట్ అవ్వాల్సిందేనంటూ చెప్పుకొచ్చారు. హీరోయిన్‌గా కంటే.. 'పడయప్ప' చిత్రంలో పోషించిన నీలాంబరి పాత్ర, తాజాగా 'బాహుబలి' చిత్రంలో రాజమాత శివగామి పాత్రల ద్వారానే మంచి పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్ రమ్యకృష్ణ. తెలుగు చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టిన తొలి రోజుల్లో ఐరెన్ లెగ్‌గా ముద్ర వేయించుకున్న... ఆ తర్వాత సక్సెస్‌పుల్ హీరోయిన్‌గా వెండితెరపై చెరగని ముద్రవేశారు. దర్శకుడు కృష్ణవంశీని వివాహం చేసుకుని... ఓ బిడ్డకు తల్లి అయింది. అయినా.. టీనేజ్ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని గ్లామర్‌తో వెండితెరపై శివగామి రాణిస్తోంది. ఈమె తాజాగా ఓ అంశంపై బోల్డ్‌గా తన మనసులోని మాటను వెల్లడించింది. 
 
ఇటీవలి కాలంలో పలువురు హీరోయిన్లు చిత్రపరిశ్రమలో తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపులపై ఒక్కొక్కరుగా నోరు విప్పుతున్నారు. నిర్మాత‌ల‌, ద‌ర్శ‌కుల రూమ్‌లకు వెళితేనే సినిమా అవ‌కాశాలు వ‌స్తాయ‌ని చాలామంది బాహాటంగా చెప్పారు. అలా లొంగ‌క‌పోతే సినిమా కెరీర్‌కు ఫుల్‌స్టాప్ ప‌డిపోతుంద‌ని స్పష్టం చేశారు. అలాంటి వేధింపులు చాలా ఎదుర్కొన్నామని కూడా కొంతమంది హీరోయిన్లు వెల్ల‌డించారు. ఈ వ్య‌వ‌హారంపై సీనియర్ హీరోయిన్ ర‌మ్య‌కృష్ణ తొలిసారి స్పందించింది.
 
ఇత‌ర రంగాల మాదిరిగానే సినిమా ఇండ‌స్ట్రీలోనూ అడ్జ‌స్ట్‌మెంట్ త‌ప్ప‌నిస‌రి అని శివగామి అంటోంది. అంతేకాకుండా అలా అడ్జ‌స్ట్ అయిన హీరోయిన్లే కెరీర్‌లో ముందుకు వెళ‌తార‌ని అభిప్రాయపడింది. అయితే అడ్జ‌స్ట్ అవ‌డం, కాక‌పోవడం అనేది వారివారి వ్య‌క్తిగ‌త నిర్ణ‌యాల‌ను బ‌ట్టి ఉంటుంద‌ని, అయితే అలా అడ్జ‌స్ట్ అయితే మాత్రం కెరీర్ పరంగా ముందుకు వెళ‌తార‌ని రమ్యకృష్ణ చెప్పడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. ఈ నేపధ్యంలో రమ్యకృష్ణ అడ్జెస్ట్ అయినట్లా కానాట్లా అంటూ సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో ధర్మ సందేహాలు లేవనెత్తుతున్నారు కొంతమంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

దేశ వ్యాప్తంగా స్వల్పంగా పెరిగిన రైలు చార్జీలు...

పోలవరం - బనకచర్ల ప్రాజెక్టుకు నో పర్మిషన్ : కేంద్రం

ఏపీ లిక్కర్ స్కామ్ : చెవిరెడ్డికి షాకిచ్చిన సిట్ బృందం .. ఇద్దరు పీఏలు అరెస్టు?

దేశంలో కీలక నిబంధనల్లో మార్పులు.. ఐటీఆర్, క్రెడిట్ కార్డులు, తత్కాల్‌ టిక్కెట్ల బుకింక్‌కు ఆధార్ లింక్...

మహిళకు మత్తుమందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడిన ఆర్ఎంపీ వైద్యుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

తర్వాతి కథనం