Webdunia - Bharat's app for daily news and videos

Install App

వారికి పడక సుఖం ఇవ్వనందుకే నాకు కెరీర్ లేకుండా పోయింది : హీరోయిన్ మాధవీలత

తన నుంచి పలువురు నిర్మాతలు పడకసుఖం కోరుకున్నారనీ, దానికి తాను నో చెప్పానని, ఫలితంగానే నాకు ఈ పరిస్థితి ఎదురైందని సినీ నటి మాధవీలత వాపోయారు. 'నచ్చావులే', 'స్నేహితుడా' వంటి చిత్రాల ద్వారా తెలుగు వెండితె

Webdunia
బుధవారం, 8 మార్చి 2017 (17:10 IST)
తన నుంచి పలువురు నిర్మాతలు పడకసుఖం కోరుకున్నారనీ, దానికి తాను నో చెప్పానని, ఫలితంగానే నాకు ఈ పరిస్థితి ఎదురైందని సినీ నటి మాధవీలత వాపోయారు. 'నచ్చావులే', 'స్నేహితుడా' వంటి చిత్రాల ద్వారా తెలుగు వెండితెరకు పరిచయమైన హీరోయిన్ మాధవీలత. కన్నడ అమ్మాయి అయినా.. అచ్చం తెలుగమ్మాయిలా కనిపిస్తుంది. 
 
చిన్న సినిమాల్లో నటించి హిట్ ట్రాక్‌ను సొంతం చేసుకుంది. కానీ సినీ ఇండస్ట్రీని మాత్రం మెప్పించలేకపోయింది. ఆ కారణంగానే ఆమెకు పెద్దగా సినిమా ఆఫర్లు రాలేదు. దీంతో మాధవీలత కోలీవుడ్‌కి మకాం మార్చేసింది. అక్కడా సక్సెస్ కాలేదు. కర్ణాటకలో పుట్టి పెరిగిన మాధవీలత మొదటి సినిమాతోనే మంచి టాలెంట్ కలిగిన నటి అని గుర్తింపు తెచ్చుకుంది. 
 
అయితే, అవకాశాలు పూర్తిగా సన్నిగిల్లడంతో ఆమె చిత్ర పరిశ్రమకు దూరమైంది. దీనికి కారణం... తాను ఇండస్ట్రీలో ఎవరికీ లొంగకపోవడమేనని చెప్పింది. ఒక ప్రొడ్యూసర్‌ అడిగిన దానికి ఆమె నో చెప్పినందుకు తనను ఎలా వేధించాడో పూసగుచ్చినట్టు వివరించింది. ఇండస్ట్రీలో పెద్ద మనుషులుగా చలామణీ అవుతున్న చాలమంది.. హీరోయిన్స్ విషయంలో మాత్రం సెక్సువల్ రిలేషన్‌కే ప్రాధాన్యత ఇస్తారని చెప్పుకొచ్చింది. 
 
ఆ పెద్ద మనుషులు చెప్పినట్టుగా తాను నడుచుకుంటూ వారు కోరినపుడు పడక సుఖం ఇచ్చివుంటే తన కెరీర్ మరోలా ఉండేదనీ, కానీ, తనకు అలాంటి అవకాశాల కంటే ఆత్మాభిమానంతో బతకడం ముఖ్యమని భావించే చిత్రపరిశ్రమకు దూరమైనట్టు చెప్పుకొచ్చింది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

బర్త్ డే పార్టీకి వెళితే మత్తు ఇచ్చి 7 రోజుల పాటు యువతిపై 23 మంది అత్యాచారం

కిడ్నాప్ కేసు : వల్లభనేని వంశీకి షాకిచ్చిన విజయవాడ కోర్టు

అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న మార్క్ శంకర్‌.. ఆర్కే రోజా స్పందన.. ఏంటంటే?

బైకును కారులా మార్చేశాడు.. ఆరుగురితో హ్యాపీగా జర్నీ చేశాడు.. (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం